Coolie Movie : సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ చిత్రం రిలీజ్‌కు ముందే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా ప్రకటన నాటి నుంచే అభిమానుల్లో హైప్ పీక్స్‌లో ఉంది. ప్రీ-బుకింగ్స్ ఓపెన్ అయ్యేసరికి టికెట్లు క్షణాల్లో ఖాళీ అయ్యాయి. ఓవర్సీస్‌లో రెండు మిలియన్ డాలర్ల వసూళ్లతో ‘కూలీ’ తమిళ సినిమాల్లో ప్రీమియర్స్‌లో రికార్డు సృష్టించింది.
ALSO READ : WAR 2 Twitter Review: ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ.. ‘వార్ 2’పై నెటిజన్స్ రిపోర్ట్
2016లో రజనీ ‘కబాలి’ నార్త్ అమెరికాలో 60 వేల డాలర్ల ప్రీ-రిలీజ్ వసూళ్లతో సంచలనం సృష్టించింది. తొమ్మిదేళ్ల తర్వాత, రజనీ స్వయంగా తన రికార్డును తానే బద్దలు కొట్టారు. “సూపర్‌స్టార్ రికార్డును సూపర్‌స్టార్ మాత్రమే బ్రేక్ చేయగలడు” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో జోష్‌లో ఉన్నారు. నాగార్జున, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్ వంటి స్టార్ కాస్ట్ ఈ చిత్రానికి మరింత బలంగా మారనున్నట్టు తెలుస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం, ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేశాయి.
లోకేశ్ కనగరాజ్ తన సిగ్నేచర్ యాక్షన్ స్టైల్‌తో ‘కూలీ’ని మరో బ్లాక్‌బస్టర్‌గా మలిచారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సినిమా కథ ఓ పోర్ట్ నేపథ్యంలో సాగనుందని, రజనీ క్యారెక్టర్‌లో మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని టాక్. ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఎలా ఊపేస్తుందో చూడాలి!


