EC Issue Voter Id With In 15 Days : ఓటరు ఐడీ కార్డులు త్వరితగతిన పంపిణీ చేయడానికి ఎన్నికల సంఘం (EC) కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ఈసీ ప్రకటించిన ప్రకారం, ఓటరు నమోదులో మార్పులు చేసినా, కొత్తగా ఓటర్లుగా నమోదు అయినా, పూర్తయిన దరఖాస్తు తర్వాత 15 రోజుల్లోగా ఓటర్ ఐడీ కార్డు (EPIC) ఇంటికి చేరేలా వ్యవస్థను రూపొందించింది.
రియల్ టైమ్ ట్రాకింగ్‌తో వేగవంతమైన సేవ :ప్రస్తుతం ఓటర్లకు ఓటర్ ఐడీ కార్డులు అందడానికి సాధారణంగా నెల రోజులకుపైగా సమయం పడుతోందని అధికారులు తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారంగా, ఎన్నికల సంఘం రియల్ టైమ్ ట్రాకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది.ఈ కొత్త విధానంలో, ఓటర్ కార్డు తయారీ ప్రారంభం నుంచి, ఓటరుకు అందే వరకూ ప్రతి దశను నిశితంగా పర్యవేక్షించనున్నారు. ఈ ప్రక్రియను ఎన్నికల రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. ఓటర్ కార్డు స్టేటస్ గురించి ప్రతి దశలో ఓటర్లకు SMS ద్వారా సమాచారం అందించనున్నారు. దీంతో ఓటర్లు తమ కార్డు తయారీ, పంపిణీ స్థితిని తేలికగా తెలుసుకునే అవకాశం పొందనున్నారు. ఈ మార్పులతో ఓటర్లకు సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందనున్నాయి.
Good News from EC for Voters : 15 రోజుల్లోనే ఓటర్ ఐడీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES