హోండా సరికొత్త ఎక్స్ఎల్ 750 ట్రాన్సాల్ప్ (Honda XL 750 Transalp) ఆఫ్-రోడ్ మోటార్‌సైకిల్‌ని విడుదల చేసింది. ఈ బైక్ ఆఫ్‌రోడింగ్ లుక్‌తో పాటు అర్బన్ స్టైలింగ్‌కి సైతం సరిపోయేలా డిజైన్ చేశారు. అడ్వెంచర్ విభాగంలో ఈ బైక్ యువతను ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉంది. ఈ బైక్ కంపెనీకి చెందిన టాప్ స్పెక్ ఆఫ్రికా ట్విన్‌ని పోలి ఉంటుంది. అయితే ముందు భాగంలో కాస్త ఎక్కువగా ఏరోడైనమిక్ వైజర్ అలాగే డ్యూయల్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇవి లాంగ్ జర్నీల్లో ప్రయాణించేటప్పుడు మంచి రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది. ఈ బైక్ అన్ని భూభాగాలకు సరిపోయేలా డిజైన్ చేశారు.
ఈ బైక్ రాక్ వైట్, గ్రాఫైట్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్ ముందు 21 ఇంచెస్, వెనక 18 ఇంచెస్ స్పోక్ వీల్స్ కలవు. ఈ బైక్ 755 సీసీ ట్విన్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 9,500 rpm వద్ద 90.5 bhp మరియు 7,250 rpm వద్ద 75 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌కి 6-స్పీడ్ ట్రాన్స్మిషన్ జతచేయబడింది. స్మూత్ హ్యాండ్లింగ్ కోసం ఈ బైక్‌లో థ్రోటిల్-బై-వైర్ (TBW) సహాయపడుతుంది. ఈ బైక్‌లో స్పోర్ట్, స్టాండర్డ్, రెయిన్, గ్రావెల్, యూజర్ అనే 5 రైడ్ మోడ్స్ కలవు. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ , ఇంజిన్ బ్రేకింగ్ కలవు. ఈ బైక్ 2-పిస్టన్ కాలిపర్లతో కూడిన డ్యూయల్ 310 mm ఫ్రంట్ డిస్క్, 256 mm రియర్ డిస్క్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటి బ్రేకింగ్ ఫీచర్లు కలవు.
ఇక ఫీచర్ల పరంగా ఎక్స్ఎల్ 750 ట్రాన్సాల్ప్‌లో 5.0-ఇంచెస్ ఫుల్-కలర్ TFT స్క్రీన్ కలిగి ఉంది. ఇది సన్‌లైట్‌లోనూ మంచి రీడబిలిటీని అందిస్తుంది. దీని హ్యాండిల్ బార్‌లో ఫోర్-వే టోగిల్ స్విచ్ కలదు దీని ద్వారా రైడర్లు మ్యూజిక్, కాల్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ మరియు నావిగేషన్‌ని కంట్రోల్ చేయవచ్చు.
ఈ బైక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సమయంలో ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, అలాగే మెరుగైన విజిబిలిటీ కోసం ఆటో టర్న్ సిగ్నల్ క్యాన్సిలేషన్, బ్యాక్ లిట్ కంట్రోల్స్ వంటి ఇతర ఉపయోగకరమైన ఫీచర్లు కలవు. మంచి ఆఫ్‌రోడర్ బైక్ కోసం చూస్తున్న వారు దీనిని కళ్లమూసుకుని కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉంది. ఈ బైక్ డెలివరీలు జూలై నుంచి ఆరంభం కానున్నాయి.


