Saturday, May 10, 2025
HomeNewsమరోసారి భారత్–పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. టెన్షన్.. టెన్షన్..!

మరోసారి భారత్–పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. టెన్షన్.. టెన్షన్..!

భారత్–పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. వరుసగా రెండో రోజు కూడా రాత్రి పడిన వెంటనే పాకిస్తాన్ డ్రోన్ల సహాయంతో దాడికి తెగబడింది. యూరీ, కుప్వారా, పూంచ్, నౌగామ్ వంటి సున్నిత ప్రాంతాల్లో పాక్ సాయుధ దళాలు కాల్పులు జరపడంతో పరిస్థితిగా మారింది. ఈ అణచివేత చర్యల నేపథ్యంలో జైసల్మేర్, యూరీ ప్రాంతాల్లో అలర్ట్ సైరన్లు మోగాయి. భారత భద్రతా దళాలు అప్రమత్తమై వెంటనే కౌంటర్ యాక్షన్‌కి దిగాయి. ప్రత్యర్థి కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతూ సరిహద్దులో పరిస్థితిని నియంత్రించేందుకు యత్నిస్తున్నాయి.

- Advertisement -

పాక్ దాడుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. తాజా దాడుల్లో సాంబ సెక్టార్, జమ్మూ, పఠాన్‌కోట్, పోఖ్రాన్ ప్రాంతాలు లక్ష్యంగా మారాయి. అయితే భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అప్రమత్తంగా ఉండటంతో పాక్ డ్రోన్లను సమయోచితంగా కూల్చివేశారు.

పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ సరిహద్దుకు సమీపంగా ఉన్న రాష్ట్రాల్లోని మొత్తం 24 విమానాశయాలను తాత్కాలికంగా మూసివేసింది. ఈ నిషేధం ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

సరిహద్దుల్లోని తాజా పరిణామాలు ప్రజలలో ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, భారత భద్రతా బలగాలు అపారమైన నిబద్ధతతో తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయి. దేశ రక్షణ విషయంలో ఎలాంటి సందేహానికీ తావు లేదని ఈ ఘటనలు మరోసారి నిరూపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News