Sunday, November 16, 2025
HomeNewsKantara Chapter 1: తొలి రోజే ఆఫ‌ర్ - కాంతార చాప్ట‌ర్ వ‌న్ మూవీ ఒక...

Kantara Chapter 1: తొలి రోజే ఆఫ‌ర్ – కాంతార చాప్ట‌ర్ వ‌న్ మూవీ ఒక టికెట్ కొంటే మ‌రోటి ఫ్రీ!

Kantara Chapter 1: రిష‌బ్ శెట్టి హీరోగా న‌టించిన కాంతార చాప్ట‌ర్ వ‌న్ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా అక్టోబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. కాంతారకు ప్రీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి రిష‌బ్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కాంతార పెద్ద హిట్ట‌వ్వ‌డంతో ఈ ప్రీక్వెల్‌పై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.
తెలుగులో స్ట్రెయిట్ సినిమాల‌కు ధీటుగా కాంతార చాప్ట‌ర్ వ‌న్ ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో తెలుగు వెర్ష‌న్ రిలీజ్ అవుతోంది. ప్ర‌భాస్ ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డం, ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అటెండ్ కావ‌డంతో ఈ క‌న్న‌డ డ‌బ్బింగ్ మూవీపై మంచి బ‌జ్ ఏర్ప‌డింది. మ‌రోవైపు ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు అనుమ‌తులు ల‌భించాయి. కాంతార ప్రీక్వెల్‌కు స్టార్స్ స‌పోర్ట్ దొరికిన తెలుగు అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం చాలా డ‌ల్‌గా ఉన్నాయి.

- Advertisement -

ఒక టికెట్ కొంటే మ‌రోటి ఫ్రీ…
కాంతార‌ను బాయ్‌కాట్ చేయాలంటూ సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం అడ్వాన్స్ బుకింగ్స్‌పై కొంత వ‌ర‌కు ఎఫెక్ట్ చూపించిన‌ట్లు క‌నిపిస్తోంది. దాంతో ఆడియెన్స్‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించేందుకు మేక‌ర్స్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. రిలీజ్ రోజే ఓ టికెట్ కొంటే మ‌రో టికెట్ ఫ్రీ అని ప్ర‌క‌టించారు. డిస్ట్రిక్ తో పాటు మ‌రికొన్ని ఆన్‌లైన్‌ టికెట్ బుకింగ్స్ యాప్‌ల‌లో ఈ ఆఫ‌ర్ క‌నిపిస్తుంది. తొలిరోజే ఒక టికెట్‌కు మ‌రో టికెట్ ఫ్రీగా ఇవ్వ‌డంపై నెటిజ‌న్లు షాక‌వుతున్నారు.

Also Read – Allu Sirish Engagement: గుడ్ న్యూస్ చెప్పేసిన అల్లు శిరీష్.. ఎంగేజ్‌మెంట్ డేట్ వెల్లడి

అతి క‌ష్టంగా…
కాంతార చాప్ట‌ర్ వ‌న్ అడ్వాన్స్ బుకింగ్స్ మిగిలిన భాష‌ల‌తో పోలిస్తే తెలుగులోనే త‌క్కువ‌గా జ‌రిగాయి. క‌న్న‌డంలో 8 కోట్లు, హిందీలో రెండున్న‌ర కోట్ల వ‌ర‌కు ప్రీ సేల్స్ జ‌ర‌గ్గా… తెలుగులో మాత్రం అతి క‌ష్టంగా కోటి ఇర‌వై ల‌క్ష‌ల వ‌ర‌కు అడ్వాన్స్ బుకింగ్స్ దాటాయి. ప్రీ రిలీజ్ బిజినెస్‌కు త‌గ్గ‌ట్లుగా అడ్వాన్స్ బుకింగ్స్ లేక‌పోవ‌డంతో డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తుంది.

125 కోట్ల బ‌డ్జెట్‌…
కాంతార చాప్ట‌ర్ వ‌న్ మూవీలో రుక్మిణి వ‌సంత్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జ‌య‌రామ్‌, గుల్ష‌న్ దేవ‌య్య కీల‌క పాత్ర‌లు పోషించారు. అజ‌నీష్ లోక‌నాథ్ మ్యూజిక్ అందించాడు. కాంతార చాప్ట‌ర్ వ‌న్ మూవీని 125 కోట్ల బ‌డ్జెట్‌తో కేజీఎఫ్ ప్రొడ్యూస‌ర్ విజ‌య్ కిర‌గందూర్ నిర్మించారు.

నేష‌న‌ల్ అవార్డ్‌…
2022లో రిలీజైన కాంతార మూవీ క‌న్న‌డ ఇండ‌స్ట్రీలోనే ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. కేవ‌లం 14 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 400 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీతో హీరోగా పాన్ ఇండియ‌న్ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నాడు రిష‌బ్ శెట్టి. బెస్ట్ యాక్ట‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డు అందుకున్నాడు.

Also Read – IDLI KOTTU MOVIE REVIEW: ఇడ్లీ కొట్టు రివ్యూ, చట్నీ కొంచెం చప్పగా ఉంది?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad