తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) పుట్టినరోజు వేడుకలు తెలంగాణలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నారు. రక్తదానాలు, అన్నదానాలు లాంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. తాజాగా తెలంగాణ భవన్‌లో కేసీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంతరి హరీశ్ రావు భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, తదితర నేతలు పాల్గొన్నారు.
మరోవైపు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. నందినగర్‌లోని వీరాంజనేయస్వామి వారి దేవాలయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నే కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అటు ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, అడిలైడ్, బ్రిస్బేన్ నగరాల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.