Friday, April 11, 2025
HomeNewsKondapaka: పార్టీ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలి

Kondapaka: పార్టీ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలి

మహారాష్ట్ర బిజెపి ఎమ్మెల్యే పంకజ్ రాజేష్

ఉమ్మడి కొండపాక మండలం, కుకునూరు పల్లి మండలాల బిజెపి పార్టీ ఎమ్మెల్యే ఆవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా దుద్దెడలోని వైష్ణవి గార్డెన్ లో రెండు మండలాల బిజెపి బూతు, మండల జిల్లా రాష్ట్రస్థాయి నాయకుల సమావేశం కొండపాక మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర బీజేపీ పార్టీ ఎంపీ పంకజ్ రాజేష్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని, బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నెరవేర్చలేని హామీలే బిజెపి అస్త్రాలని వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రతి కార్యకర్త సైనికుని లాగా పని చేయాలని ఈ ప్రాంతీయ పార్టీ కుటుంబ పాలన అవినీతి ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్య పరచాలని, సంక్షేమ కార్యక్రమాలన్నీ కేవలం నామాత్రంగా వారి కార్యకర్తలకు ప్రకటించి ఎలక్షన్లు పూర్తయిన తర్వాత మిగతా వారికి ఇస్తామని అబద్ధపు హామీలతో ప్రజలను ప్రలోభాలకు గురిచేయడమే కేసీఆర్ ప్రభుత్వ విధానమని దీనిని ప్రజలు పూర్తిగా గమనించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి జిల్లా మండల స్థాయి నాయకులు పూర్తిస్థాయిలో సమయం కేటాయించి రాష్ట్రంలో బిజెపి పార్టీని అధికారంలో తేవాలని అప్పుడే ప్రజలకు నిజమైన సంక్షేమ ఫలాలు అందుతాయని కార్యకర్తలను నిర్దేశించి ఆయన ప్రసంగించారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ బి ఆర్ఎస్ పార్టీతో మాకు ఎటువంటి సంబంధం లేదని వారితో ఎలాంటి పొత్తుల కలయిక ఉండదని, ప్రజల్లో అపోహ సృష్టించడానికి కాంగ్రెస్ పార్టీ, బి ఆర్ ఎస్ పార్టీ ఆడుతున్న నాటకమే అని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి జిల్లాస్థాయి బూతు స్థాయి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని పార్టీ బలోపేతానికి చేయవలసిన కృషిని ఈ సందర్భంగా చర్చించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News