Neem Leaves Benefits: వేప ఆకులకు భారతదేశంలో ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఆయుర్వేదంలో వీటిని ఔషధంగా ఉపయోగిస్తారు. వేపలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే దీన్ని తరచుగా ‘సర్వరోగ నివారిణి’ అని పిలుస్తారు. వేప ఆకుల వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వేప ఆకు వల్ల కలిగే ఆరోగ్యలాభాలు:
✏ వేప ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌లు శరీరానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా తరుచుగా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల బారిన పడకుండా చేస్తాయి. అలాగే ఫ్రీ రాడికల్స్‌ను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. కొంతమంది ఈ ఆకులను నేరుగా తింటారు.
✏ చర్మ సమస్యలతో బాధపడేవారు వేప ఆకులను ఉపయోగించడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఇందులో ఉండే పేస్ట్‌లా చర్మ సమస్యలు రాకుండా చేస్తుందని చర్మనిపుణులు చెబుతున్నారు. వేప ఆకులతో ఫేస్ ప్యాక్ చేసుకోవడం ఎంతో సులభం. దీని ప్రతిరోజు కూడా వాడవచ్చు.
✏ రక్తని శుద్థి చేయడంలో వేప ఆకులు కీలక ప్రాతను పోషిస్తాయి. ఇది రక్తంలో ఉండే మలినాలను తొలిగిస్తుంది కాబట్టి క్రమం తప్పకుండా ప్రతిరోజు రెండు వేప ఆకులు తినడం మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇది షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది.
✏ జీర్ణ సమస్యలతో బాధపడేవారు కూడా ఈ వేప ఆకులు తినవచ్చు. ఇది గ్యాస్, అజ్జీరం, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. పరగడుపు వేప ఆకులు తినడం వల్ల మలబద్దకం తగ్గుతుంది.
✏ డయాబెటిస్‌తో బాధపడేవారు కూడా వేప ఆకులను తినవచ్చు ఇందులో ఉండే కొన్ని సమ్మేళనాలు షుగర్ కంట్రోల్ చేయడంలో సహాయపడుతాయి. ఖాళీ కడుపుతో వేప ఆకులు తినడం లేదా జ్యూస్ చేసుకోని తాగడం మంచిది. ఇది ట్రై చేసే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.
✏ దంతాల సమస్యలు, నోటి దుర్వాసన రాకుండా ఉంచడంలో వేప ఆకులు సహాయపడుతాయని వైద్యులు చెబుతన్నారు. ఇందలో ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు చిగుళ్ల నొప్పి, దంత క్షయం నుంచి రక్షిస్తుంది.
✏ జుట్టు ఆరోగ్యానికి వేప ఆకులు మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇది చుండ్రు, పేలు, దురదను తగ్గిస్తుంది. వేప ఆకులను నీటిలో మరిగించి ఈ నీటితో జుట్టును కడగడం వల్ల కురులు ఆరోగ్యంగా పెరుగుతాయి. అంతేకాకుండా తెల్ల జుట్టు సమస్యలు రాకుండా చేస్తుంది.