కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 127-రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్ సామ్రాట్ ఫంక్షన్ హాల్ లో గాంధీనగర్ ఇండస్ట్రియల్ అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు “పవర్ లేని నాయకుల నిర్ణయాలతో పారిశ్రామిక వాడల్లో పవర్ హాలిడేలతో పరిశ్రమలు మూతపడగా కార్మికులు రోడ్డున పడేవారని, కానీ నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన “పవర్ ఫుల్ లీడర్ పాలనలో 24 గంటల విద్యుత్ సరఫరాతో నూతన పరిశ్రమలు పెట్టుబడులతో రాష్ట్రానికి వస్తున్నాయని” ఇదే తొమ్మిదేళ్ల బిఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధికి ప్రతీక అన్నారు.
నూతన పారిశ్రామిక విధానం టిఎస్-ఐ పాస్ తో ఎటువంటి కార్యాలయాల చుట్టూ తిరగకుండా అనుమతులు ఇస్తూ తెలంగాణ పారిశ్రామిక విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. నేడు పారిశ్రామిక వాడలలో నూతన పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతుండగా ఇక్కడ ఉపాధి కోసం దేశంలోని ఇతర రాష్ట్రాల కార్మికులు నేడు హైదరాబాద్ సిటీ వైపు చూసే పరిస్థితి ఏర్పడిందన్నారు. శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు కమాండ్ కంట్రోల్ ఏర్పాటుతో రాష్ట్రంలో నిఘా వ్యవస్థ పటిష్టటతో, శాంతిభద్రతలు అదుపులో ఉంటూ దేశంలోనే నేడు హైదరాబాద్ నగరం సేఫెస్ట్ సిటీగా నిలిచిందన్నారు.ఇలాంటి పారదర్శక పాలనతో ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు అవ్వాలంటే ముచ్చటగా మూడవసారి బి.ఆర్.ఎస్ పార్టీని గెలిపించి హ్యాట్రిక్ విజయంతో సీఎం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో గాంధీనగర్ ఐలా చైర్మన్ వెంకట రాజం, గాంధీనగర్ ఇండస్ట్రియల్ అధ్యక్షులు, పవర్ టెక్ పరిశ్రమ అధినేత స్వామి గౌడ్, తెలంగాణ ఇండస్ట్రియల్ పారిశ్రామిక సమాఖ్య అధ్యక్షులు కే. సుధీర్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి టి.గోపాల్ గారు, జీడిమెట్ల ఐలా వైస్ చైర్మన్ ఏ. లక్ష్మీనరసింహారెడ్డి (ఏఎల్ఎన్ రెడ్డి), జీడిమెట్ల ఇండస్ట్రియల్ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, రంగారెడ్డినగర్ డివిజన్ కార్పొరేటర్ విజయ శేఖర్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు ఎర్వ శంకరయ్య, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.