Monday, November 17, 2025
HomeNewsUltraviolette X47: ఎలక్ట్రిక్‌ అడ్వెంచర్‌ బైక్‌ కావాలా? ఇదిగో ఇది ఫర్‌ఫెక్ట్‌ ఆప్షన్‌

Ultraviolette X47: ఎలక్ట్రిక్‌ అడ్వెంచర్‌ బైక్‌ కావాలా? ఇదిగో ఇది ఫర్‌ఫెక్ట్‌ ఆప్షన్‌

Ultraviolette X47 EV: భారతీయ మార్కెట్‌లోకి అల్ట్రావయలెట్‌ సరికొత్త ఎక్స్47 (Ultraviolette X47) ఈవీ బైక్‌ని విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ అదిరిపోయే డిజైన్‌తో పాటు అడ్వెంచర్ ఫీల్‌ని అందించనుంది. ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌లో మంచి అడ్వెంచర్‌ అనుభూతిని కోరుకునే వారు ఈ బైక్‌ని కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

డిజైన్‌: ఈ బైక్‌ని ఎఫ్77 మాక్ 2 మోడల్‌ ఆధారంగా తీసుకువచ్చారు. ఈ క్రేజీ బైక్‌ల సింగిల్ పీస్ హ్యాండిల్ బార్, ట్రైయాంగిల్‌ హెడ్‌ల్యాంప్, టూరింగ్ విండ్‌స్క్రీన్‌, ముందు భాగంలో షార్ప్‌ అడ్వెంచరస్ లుక్​ను కలిగి ఉంటుంది. దీని బ్యాటరీ ఎక్స్‌టీరియర్‌లో ఉన్నప్పటికీ ప్రత్యేక క్రాష్ గార్డ్స్‌ వీటికి సేఫ్టీని అందిస్తాయి. వెనక సీటు అడ్వెంచర్‌ లుక్‌తో మరింత హైలైట్‌గా కనిపిస్తుంది.

రేంజ్: ఈ బైక్‌ 7.1 kWh, 10.3 kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్స్‌తో వస్తుంది. ఇవి వరుసగా 263 కి.మీ, 323 కి.మీ ఐడిసి రేంజ్‌ని అందిస్తాయి. ఈ బైక్‌ టైప్ 2 AC కార్ ఛార్జర్‌తో పాటు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. కొత్త బూస్ట్ టెక్నాలజీ ఆధారంగా ఛార్జింగ్ సమయం సగానికి పైగా తగ్గుతుంది.

ఫర్ఫామెన్స్‌: ఇందులోని టాప్ వెర్షన్ 30 కిలోవాట్ మోటర్‌తో పనిచేస్తుంది. ఇది 40 bhp పవర్‌ని, 100 nm టార్క్‌నీ అందిస్తుంది. ఈ బైక్‌ కేవలం 2.7 సెకన్లలో 0-60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అంతే కాకుండా ఈ ఈవీ బైక్‌పై గరిష్టంగా 145 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. ఈ బైక్‌ బ్యాక్‌ వీల్‌కి 610 nm టార్క్‌ని అందించగలదని కంపెనీ పేర్కొంది.

బ్రేకింగ్ సిస్టమ్‌: ఇది ఎఫ్77 ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా తయారు చేసినప్పటికీ ఎక్స్47 ఢిఫరెంట్‌ ఛాసిస్, ఫ్రేమ్‌తో వస్తుంది. ముందు భాగంలో 41 mm USD ఫోర్క్‌లు, వెనకవైపు ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్‌ కలదు. ఇది మంచి సస్పెన్షన్‌ అనుభూతిని అందిస్తుంది. ముందు 320 mm డిస్క్, వెనక 230 mm డిస్క్‌ బ్రేకింగ్‌ కలదు. ఇవి బాష్‌ స్విచ్చబుల్ డ్యూయల్–ఛానెల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్‌ని కలిగి ఉంటాయి.

ఈ బైక్ (T1, T2, T3, Off) నాలుగు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్‌తో వస్తుంది. రీజెన్ బ్రేకింగ్‌కి 9 లెవెల్స్ ఉన్నాయి. ఇవి బ్రేకింగ్ స్థిరత్వాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఈవీలలోనే తొలిసారి ఈ బైక్‌లో రేడియల్ ఆల్ టెర్రైన్ టైర్లను కంపెనీ అందించింది.

స్మార్ట్ రాడార్ సిస్టమ్‌: ఈ ఎక్స్47లో “హైపర్ సెన్స్” రాడార్ సిస్టమ్‌ని తీసుకువచ్చారు. ఇది 200 మీటర్ల దూరం వరకు వస్తువులను గుర్తిస్తుంది. బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ చేంజ్ అలర్ట్స్, ఓవర్టేక్ అలర్ట్స్‌, బ్యాక్‌ కొలిజన్ వార్నింగ్ వంటి ఫీచర్లు అందులో ఉన్నాయి.

ధర: ఈ అల్ట్రావయలెట్‌ ఎక్స్47 ధర రూ. 2.74 లక్షలు (ఎక్స్-షోరూం)గా కంపెనీ ప్రకటించింది. అయితే ముందు బుక్‌ చేసుకునే 1,000 మంది కస్టమర్లకు రూ. 2.49 లక్షలకే అందిస్తోంది. ఈ బైక్‌ స్టాండర్డ్ క్రాస్‌ఓవర్, డీసెర్ట్‌ వింగ్‌ వెర్షన్‌ (Desert Wing) అనే రెండు వెర్షన్‌లలో లభిస్తుంది.

బుకింగ్స్‌: క్రాస్‌ఓవర్ వేరియంట్‌ని కేవలం రూ. 999 అడ్వాన్స్‌తో బుక్ చేసుకోవచ్చు. ఇక డీసెర్ట్‌ వింగ్‌ వెర్షన్‌లో TPMS, డాష్‌క్యామ్‌లు, హ్యాండ్‌గార్డ్స్‌ వంటివి ప్రత్యేకంగా ఉంటాయి. ఈ వెర్షన్‌ ట్రిమ్‌ కోసం రూ. 4,999 బుకింగ్‌ అమౌంట్‌ చెల్లించాలి. ఈ స్పెషల్ ఎడిషన్ ధరను డెలివరీలు ప్రారంభానికి ముందే వెల్లడిస్తామని కంపెనీ పేర్కొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad