వైసీపీ పాలనలో వైసిపి కమిషన్ల పాలనకు ప్రజలు స్వప్తి పలికి టిడిపి టిడిపి అధికారంలోకి రాగానే అన్ని సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేసి చూపిస్తామని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. పట్టణంలోని కోవెలకుంట్ల రోడ్డు దొమ్మరి కాలనీ ఈ ప్రాంతాలలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి టిడిపి ప్రభుత్వం చేసే అభివృద్ధి పథకాలను వివరించి కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో టిడిపి ప్రభుత్వంలో ఆళ్లగడ్డలో స్వేచ్ఛ ఉండేదని ప్రజలు ప్రశాంతంగా ఉండేవారని అన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దౌర్జన్యాలు దోపిడీలు అధికమయ్యాయన్నారు. ఆళ్లగడ్డలో నీటి సమస్య ఉన్న స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారన్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా షాపుల ముందు గోతులు తవ్వి మట్టిని అమ్ముకున్న దుస్థితి ఆళ్లగడ్డ వైసీపీ నాయకులకు పట్టిందన్నారు.
ఓట్లను రాబట్టుకోవాలని వైసిపి నాయకులు ప్రయత్నిస్తున్నారని, చిన్నచిన్న వ్యాపారస్తులను ఇబ్బంది పెడుతూ కమిషన్లు వసూలు చేస్తున్నారన్నారు. ఆళ్లగడ్డలో ఎక్కువ సమస్యలు ఉన్న కారణంగా బయటికి రాలేని స్థితిలో ఉన్నారని ఆమె ఆరోపించారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఆళ్లగడ్డలో నీటి అభివృద్ధి పనులను కొనసాగించి ఉంటే ఆళ్లగడ్డలో నీటి సమస్య ఉండేది కాదన్నారు. వారం రోజులు నుండి తాను నీటి సమస్య గురించి మీడియా ద్వారా తెలుపుతున్నామని కేసీ కెనాల్ నుండి నీటిని మన్నించి గనులన్నీ నింపి ఉంటే బోర్లన్ని రీఛార్జి అయ్యేటివని నీటి సమస్య ఉండేది కాదని అని అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఆళ్లగడ్డ నుండి అమరావతి వరకు అభివృద్ధి ఏమిటో చూపిస్తామని ఆమె అన్నారు. టిడిపిలో చేరికలు పెద్ద స్థాయిలో జరుగుతున్నాయని టిడిపి అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరూ ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం టిడిపి జెండా ఎగురవేయాలని ఎదురుచూస్తున్నారని ఆ దిశగా ముందుకు సాగి ఆళ్లగడ్డను అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ హుస్సేన్ భాష ,చింతకుంట్ల శేఖర్ రెడ్డి, నాగాంజనేయులు, పోలా రామ పుల్లారెడ్డి . నక్కల దీన్నే శ్రీనివాస్ రెడ్డి, రామాచారి మాజీ కౌన్సిలర్ వీరన్న, భాస్కర్ యాదవ్, నారాయణ గౌడ్, జానా సత్యం, రమీజా ,నూర్జహాన్, టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.