కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ముందు కొందరు కార్యకర్తలు ఆగ్రహంతో ధర్నాకు దిగారు. తమకు టికెట్ ఎందుకు ఇవ్వలేదన, టికెట్ కు మేము అర్హులం కాదా అని మీడియా ముఖంగా ప్రశ్నించారు నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. విషయం తెలుసుకున్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ డిసిసి కార్యాలయానికి చేరుకొని ధర్నాకు దిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సముదాయించారు. మీరంతా పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడుతున్నప్పటికీ మీరంటే తమకు ఎంతో గౌరవం ఉన్నదని, మీ కష్టానికి తగ్గ ఫలితం లభించాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని అన్నారు. అధిష్టానం ఆశీస్సులతో నాకు టికెట్ దక్కినప్పటికీ మీ సహాయ సహకారాలు నాకు తప్పక అందించాలని కార్యకర్తలను విజ్ఞప్తి చేశారు.
అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కార్యాలయానికి చేరుకున్న అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి నన్ను నమ్ముకుని, పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూస్తానని పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలు అందరికి సముచిత స్థానం లభించే విధంగా కృషి చేస్తానని అన్నారు.
పురుమల్ల శ్రీనివాస్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని కార్యకర్తల సమక్షంలో ఆలింగనం చేసుకొని మీ అందరి మద్దతు నాకు ఉండాలని, మనమంతా కలిసి పని చేసుకుందామని, మీ అందరిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని హామీ ఇవ్వడంతో కార్యకర్తలు శాంతించి జై కాంగ్రెస్ నినాదాలతో హోరెత్తించారు.
పురుమళ్ళ శ్రీనివాస్ ని పద్మాకర్ రెడ్డి కరీంనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఖరారు చేసిన అనంతరం మొదటిసారి డీసీసీ కార్యాలయానికి విచ్చేసిన పురుమల శ్రీనివాస్ ని డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి కార్యాలయంలోకి సోదరంగా స్వాగతించి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ముఖ్య నేతలతో డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తో కురుమల శ్రీనివాస్ ప్రత్యేకంగా సమావేశమై నామినేషన్ ప్రక్రియ పార్టీ కార్యకర్తలతో సమావేశం తదితర అంశాలపై చర్చించారు.