మెదక్ ఎంపీ, బీఆర్‌ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు. కాంగ్రెస్ పార్టీ గుండాలు కొత్త ప్రభాకర్ రెడ్డి పైన చేసిన భౌతిక దాడిని తీవ్రంగా ఖండించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు. ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి కాంగ్రెస్ పార్టీ మా నాయకులపై భౌతిక దాడులకు దిగి వారిని అంతమొందించాలని చూస్తుందంటూ కేటీఆర్ ఆరోపించారు.
దుర్మార్గుడైన ఒక నేరస్తుడు రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా చేసినందునే ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ఈ దాడి పైన ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు కేటీఆర్ అన్నారు.