కర్నూలు జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కొవ్వొత్తులు, టార్చ్ లైట్లు, సెల్ ఫోన్ లైట్లతో పెద్ద ఎత్తున గ్రామగ్రామాన నిరసనలు సాగాయి. స్థానిక టీడీపీ నేతల్లో.. ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలు తమ నిరసన గళాలను వినిపించారు. మహానంది, ఆళ్లగడ్డ, బేతంచర్ల, పెద్దకడబూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.



