రానున్న ఎన్నికల్లో ఢిల్లీ పార్టీలకు బుద్ది చెప్పాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆనవాయితీ ప్రకారం మంత్రి బొమ్మకల్ నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం రాకముందు అభివృద్ధి శూన్యమన్నారు. కరెంటు, నీళ్లు లేక రైతులు ఆగమయ్యారన్నారు. కరీంనగర్ చరిత్రలో ఎవరికి లేని అదృష్టం తనకే కలిగిందన్నారు. నాల్గో సారి కూడా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు…
కరువు కాటకాలతో రైతులంతా దుబాయ్ కి వలసలు వెళ్లారని గుర్తుచేశారు. మానేరు డ్యామ్ తలాపునకు ఉన్న తాగటానికి చుక్క నీరు లేకుండేవన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో కరీంనగర్ దుసుకుపోతుందన్నారు. తెలంగాణలో కరీంనగర్ రూపు రేఖలు మారిపోయాయన్నారు. తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉందన్నారు. 2009 లో నన్ను గెలిపించి ఆశీర్వాదం అందించారన్నారు.
కరీంనగర్ చరిత్రలో ఎవరికి లేని అదృష్టం నాకే కలిగిందని మూడోసారి కూడా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు. బొమ్మకల్ నుండి ప్రచారం చేయడం ఆనవాయితీ అని మళ్లీ కారు గుర్తుపై ఓటు వేసి మూడోసారి కెసిఆర్ను ముఖ్యమంత్రి చేయాలని అలాగే నన్ను కూడా అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.