Saturday, May 18, 2024
Homeపాలిటిక్స్Thangallapalli: కేటీఆర్ వెంటే మేము

Thangallapalli: కేటీఆర్ వెంటే మేము

బిఆర్ఎస్ లో చేరిన బీఎస్పీ నాయకులు

కేటీఆర్ వెంటే మేము అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు గుండు ప్రేమ్ కుమార్, మండల కమిటీ నాయకులు, కార్యకర్తలు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు.

- Advertisement -

ఈ సందర్భంగా గుండు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ సిరిసిల్లను కేటీఆర్ ఎంతో అభివృద్ధి చేశాడని, మంచి వ్యక్తిత్వం కలిగిన నాయకుడని కొనియాడారు. బిఆర్ఎస్ పార్టీ కోసం, ఎంపి అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తామని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, తంగళ్ళపల్లి ఎంపీపీ పడగల మానస రాజు, మండల అధ్యక్షుడు గజబింకార్ రాజన్న, మాజీ ఏఎంసి చైర్మన్ పూసపల్లి సరస్వతి, సీనియర్ నాయకులు అవునూరి రమాకాంత్, మీరాల భాస్కర్ యాదవ్, జిల్లా యూత్ నాయకుడు చిలువేరి చిరంజీవి, రెడ్డి సంక్షేమ సంఘం తంగళ్ళపల్లి మండలాధ్యక్షుడు ఎసిరెడ్డి రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News