Saturday, May 18, 2024
Homeపాలిటిక్స్Thimmapur: బిల్లులివ్వకుంటే మూకుమ్మడి నామినేషన్లు, కాంగ్రెస్ కూడా మోసం చేసింది

Thimmapur: బిల్లులివ్వకుంటే మూకుమ్మడి నామినేషన్లు, కాంగ్రెస్ కూడా మోసం చేసింది

మాజీ సర్పంచుల నిర్ణయం

పెండింగ్ బిల్లులను విడుదల చేయకుంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మూకుమ్మడిగా నామినేషన్లు వేసేందుకు మాజీ సర్పంచుల సంఘం ఏకగ్రీవంగా తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. ఆ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల సర్పంచులు, వారి బంధువులు జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ లో మంగళవారం సమావేశమైనట్లు తెలిసింది. అయితే పార్టీలతో సంబంధం లేకుండా తమ పెండింగ్ బిల్లులు ఎవరైతే ఇప్పిస్తారో వారికే మద్దతు ఇవ్వాలన్న నిర్ణయానికి రాగా, ఒకవేళ ఏ పార్టీ నాయకుడు బిల్లులు ఇప్పించేందుకు ముందుకు రాకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఎంపీ స్థానాల్లో మూకుమ్మడిగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా గత ప్రభుత్వాలైన కేంద్రంలోని బీజేపీ గానీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ కాని బిల్లులు చెల్లిస్తామని హామీలిచ్చి విస్మరించిన విషయం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బిల్లుల విషయమై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం తమను మోసం చేసిందంటూ సమావేశంలో పలువురు సర్పంచులు వాపోయినట్లు తెలిసింది. గ్రామాభివృద్ధికి లక్షల్లో అప్పుచేసిన తమకు బిల్లులు ఇప్పిస్తామంటూ ఏ పార్టీ అభ్యర్థి హామీ ఇస్తే ఆయనకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా పార్టీలకతీతంగా ఆ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేసేందుకు ముందుకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News