Sunday, November 16, 2025
HomeఆటAP: మంత్రి రోజాను కలిసిన ఛాంపియన్ సాకేత్

AP: మంత్రి రోజాను కలిసిన ఛాంపియన్ సాకేత్

భారత ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడు సాకేత్ మైనేని ఏపీ మంత్రి రోజాను మర్యాదపూర్వకంగా కలిశారు. డబుల్స్ ర్యాంకింగ్ 74వ స్థానంలో ఉన్న సాకేత్, 2017లో ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డును అందుకున్నారు. డేవిస్ కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సాకేత్. ఆయన ఇంచియాన్ ఆసియా క్రీడలు 2014లో మిక్స్‌డ్ డబుల్స్‌లో బంగారు పతకాన్ని, పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో రజత పతకాన్ని గెలుచుకున్నారు. 10 ITF, 2 ATP ఛాలెంజర్ సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్న ఛాంపియన్ గా నిలిచారు సాకేత్. 18 ITF, 14 ATP ఛాలెంజర్ డబుల్స్ టైటిల్స్ తన ఖాతాలో వేసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad