Monday, June 24, 2024
HomeఆటGarla: ఉజ్వల భవిష్యత్తుకై చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

Garla: ఉజ్వల భవిష్యత్తుకై చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవడమే కాకుండా క్రీడలలో రాణించినప్పుడే ఉజ్వలమైన భవిష్యత్తు లభిస్తుందని గార్ల ఎస్ ఐ ఎన్ జీనత్ కుమార్ మాజీ ఫిజికల్ డైరెక్టర్ రామన్నలు అన్నారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక బాస్కెట్ బాల్ గ్రౌండ్ లో నిర్వహించిన బాస్కెట్ బాల్ సమ్మర్ కోచింగ్ ముగింపు కార్యక్రమంలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ బాస్కెట్ బాల్ క్రీడలో మెలకువలు నేర్చుకొని మండల స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు విద్యార్థిని విద్యార్థులు ఎదిగి గార్ల మండలానికి తల్లిదండ్రులకు కోచ్ లకు పేరు ప్రఖ్యాతలు తీసుకొని రావాలని కోరారు.

- Advertisement -

బాస్కెట్ బాల్ అసోసియేషన్ గార్ల మండల అధ్యక్షులు సూత్రపు జయశంకర్ మాట్లాడుతూ గార్ల మండలంలో అంతరించిపోతున్న బాస్కెట్ బాల్ క్రీడకు పునర్ వైభవం తేవడానికి ఎంతో మంది రామన్న సార్ శిష్యులు ఆర్థిక సహాయం చేయడం వలన ఈనాడు బాస్కెట్ బాల్ మట్టి కోర్టును విద్యుత్ ఫెడ్ లైటింగ్ లతో ఏర్పాటు చేసుకొని దాదాపు 40 మంది విద్యార్థిని విద్యార్థులకు సమ్మర్ కోచింగ్ ఇచ్చామన్నారు. ఎంతో మంది గార్ల నుండి బాస్కెట్ బాల్ క్రీడలో జాతీయస్థాయిలో ఆడి ఉన్నతమైన ఉద్యోగాలలో స్థిరపడి ఉన్నారని అన్నారు. గార్లలో బాస్కెట్ బాల్ సిమెంట్ కోర్టు ఉన్నట్లయితే చాలా మంది విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇచ్చి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేయగలమని ప్రజా ప్రతినిధులు గార్లలో బాస్కెట్ బాల్ సిమెంట్ కోర్టు నిర్మాణానికి తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు.

అనంతరం సమ్మర్ కోచింగ్ క్యాంపులో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికేట్ తోపాటు మెమోంటోను ఎస్ఐ జీనత్ కుమార్ మాజీ పి.డి రామన్న చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో జాతీయస్థాయి అథ్లెటిక్ గోల్డ్ మెడల్ సాధించిన సాంబమూర్తి, గార్ల మండల బాస్కెట్ బాల్ అసోసియేషన్ సభ్యులు తోడేటి రాము, కత్తుల ప్రశాంత్, బూర్ల చంద్రశేఖర్, రెడ్డిమల్ల ఉమేష్ , శేఖర్, ఆశిష్ జైన్, అలవాల పవన్, రిజ్వాన్, సిద్దు, మేఘన్ విద్యార్ధి విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News