Tuesday, October 8, 2024
HomeతెలంగాణGarla: ప్రభుత్వ ఆసుపత్రిలోనే సురక్షిత కాన్పులు

Garla: ప్రభుత్వ ఆసుపత్రిలోనే సురక్షిత కాన్పులు

ఫ్రీ అండ్ సేఫ్ డెలివరీ

ప్రభుత్వ ఆసుపత్రిలోనే మహిళలకు సురక్షితమైన కాన్పులు జరుగుతాయని సూపరిండెంట్
డాక్టర్ రమేష్ అన్నారు. గార్ల కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో గోపాలపురం గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీ కాంపాటి నాగమణి కి ఉదయం ఎలాంటి ఆపరేషన్ అవసరం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పు నిర్వహించడంతో 2.5 కేజీల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఈ సందర్బంగా సూపరిండెంట్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు రోగులకు అందుతాయన్నారు. మహిళలు ప్రసవాల కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి డబ్బులను వృథా చేసుకోవద్దని సూచించారు. సిజేరియన్ డెలివరీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పుట్టిన పిల్లలు పలు విధమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో సహజ కాన్పులతోనే తల్లి పిల్లలకు శ్రేయస్కరం అన్నారు.

- Advertisement -

గర్భం దాల్చిన మొదటి నెల నుంచి ప్రసవం వరకు ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకుంటే నాణ్యమైన వైద్యం అందడంతో పాటుగా తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ సుఖ ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సత్యనారాయణ డాక్టర్ హనుమంతరావు మిడ్వైఫరీ సుధా నాగమణి పుష్ప పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News