Pakistan: పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది ప్రపంచ రికార్డు సాధించాడు. వన్డే క్రికెట్‌లో సరికొత్త చరిత్ర తిరగ రాశాడు. 65 వన్డే మ్యాచ్ లలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు రషీద్ ఖాన్ పేరిట ఉండేది. 65 వన్డే మ్యాచ్ లలో రషీద్ ఖాన్ 128 వికెట్లు తీయగా.. షాహీన్ షా అఫ్రిది 131 వికెట్లను పడగొట్టాడు.
శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే షాహీన్ షాకి 65వ మ్యాచ్ కాగా, అందులో షాహీన్ షా నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతను వరల్డ్ రికార్డుని తన ఖాతాలో జమ చేసుకున్నాడు. ఈ వన్డే మ్యాచ్ లో వెస్టిండీస్ పై పాకిస్థాన్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ టీం వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది.
ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ టీం టాస్ గెలిచింది. దీంతో వెస్టిండీస్ కి బ్యాటింగ్ ఇచ్చి రిజ్వాన్ టీం బౌలింగ్ చేసారు. పాక్ బౌలర్లు షాహీన్ 51 పరుగులిచ్చి 4 వికెట్లతో చెలరేగగా, నసీమ్ షా 3 వికెట్లు పడగొట్టాడు. సయీమ్ ఆయుబ్, సూఫియాన్ ముకీమ్, సల్మాన్ ఆఘా ఒక్కో వికెట్ ని వారి ఖాతాలో వేసుకున్నారు. మొత్తంగా వెస్టిండీస్ ని 280 పరుగులకు ఆలౌట్ చేసారు.
281 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 284 పరుగులు చేసి విజయం సాధించింది. 48.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయారు. పాకిస్థాన్ బ్యాటర్లు బాబర్ ఆజం (47), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (53), హసన్ నవాజ్ (63), హుసేన్ తలత్ (41) చేసి పాకిస్తాన్ ని గెలిపించారు.
Read more: https://teluguprabha.net/sports-news/apl-2025-won-amaravati-royals/
వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ ఈ మ్యాచ్ తీర్పుపై స్పందిస్తూ.. టాస్ కీలక పాత్ర పోషించింది, మేము మరికొన్ని పరుగులు చేసి ఉంటే బాగుండేది అని అన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో మొదటిది పూర్తవగా రెండో వన్డే ఆగష్టు 10న ట్రినిడాడ్ వేదికపై జరగనుంది.


