Virat Kohli grey beard Pic viral: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఈ ఫోటోలో కింగ్ కోహ్లీ నెరిసిన గడ్డతో కనిపించాడు.అభిమానితో లండన్ లో దిగిన ఈ ఫోటోలో విరాట్ గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించాడు. దాంతో ఆయన వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో కోహ్లీ ఫాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు.
ఇటీవల లండన్‌లో షాష్ కిరణ్ అనే వ్యక్తితో ఫోటో దిగాడు. అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో కోహ్లీ తెల్ల గడ్డంతో కనిపిస్తున్నారు. అతడిని ఈ లుక్ లో చూసి చాలా మంది ఫ్యాన్స్ షాక్ అయ్యారు. కొంత మంది అభిమానులైతే తాము కోహ్లీని గుర్తుపట్టలేకపోయామంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇప్పటికే టెస్టుల నుంచి తప్పుకున్నా కింగ్.. ఇప్పుడు వన్డేల నుండి కూడా తప్పుకోబోతున్నాడనే వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. “వన్డే రిటైర్మెంట్ లోడింగ్?” అంటూ చాలా మంది సోషల్ మీడియా వేదికగా మీమ్స్,పోస్టులు పెడుతున్నారు.
కోహ్లీ నెరిసిన గడ్డం వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. జూలై 2023లో భార్య అనుష్క శర్మతో కలిసి దిగిన ఫోటోలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో దర్శనమిచ్చాడు. అప్పుడు ఆ ఫోటో చాలా వైరల్ అయింది. ప్రస్తుతం అతడు శారీరకంగా ఫిట్‌నెస్‌తో ఉన్నప్పటికీ.. అతడి లుక్ మాత్రం రిటైర్మెంట్‌పై చర్చకు తావిచ్చింది. అయితే దీనిపై విరాట్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కోహ్లీ నిర్ణయం కోసం మెుత్తం క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తుంది. అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా సిరీస్ లో మళ్లీ జట్టుతో కలవబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ లో టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
Also read: Haider Ali – అత్యాచారం కేసులో అరెస్టైన పాకిస్థాన్ స్టార్ బ్యాటర్!


