Sunday, November 16, 2025
Homeటెక్నాలజీDiscount: ఫ్లిప్‌కార్ట్ సేల్..రూ.15,000 కంటే తక్కువ ధరకే CMF ఫోన్ 2 ప్రో..

Discount: ఫ్లిప్‌కార్ట్ సేల్..రూ.15,000 కంటే తక్కువ ధరకే CMF ఫోన్ 2 ప్రో..

CMF Phone 2 Pro: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్‌ కొనసాగుతోంది. ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ నుండి గృహోపకరణాల వరకు అనేక రకాల ఉత్పత్తులపై గణనీయమైన తగ్గింపులను అందిస్తోంది. ఎప్పటి లాగే ఈసారి కూడా స్మార్ట్‌ఫోన్ల పై భారీ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. అత్యంత ఆకర్షణీయమైన డీల్‌లలో ఒకటి CMF ఫోన్ 2 ప్రో. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ డీల్ ఉత్తమ ఎంపిక అవుతుంది. సేల్ సమయంలో మీరు CMF ఫోన్ 2 ప్రోను రూ.15,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ఏ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.

- Advertisement -

 

CMF ఫోన్ 2 ప్రో: డీల్స్

CMF ఫోన్ 2 ప్రో ఇండియాలో రూ.18,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఈ ఫోన్ 8GB+128GB స్టోరేజీ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,999కి లిస్ట్ అయింది. ఈ-కామర్స్ కంపెనీ తన బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా CMF ఫోన్ 2 ప్రోపై ఏకంగా రూ.3,000 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీనితో పాటు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చెల్లిస్తే, అదనంగా రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. ఇంకా ఎక్కువ ఆదా చేయడానికి, పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.12,050 వరకు తగ్గింపు పొందవచ్చు. కాకపోతే ఎక్స్ఛేంజ్ విలువ పాత ఫోన్ కండిషన్, మోడల్ పై ఆధారపడి ఉంటుంది.

CMF ఫోన్ 2 ప్రో: ఫీచర్లు

ఈ పరికరం 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 1.07 బిలియన్ రంగులతో 6.77-అంగుళాల FHD+ అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో 5G చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఫోటోగ్రఫీ కోసం CMF ఫోన్ 2 ప్రోలో 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇది 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కూడా ప్యాక్ చేస్తుంది.

నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad