Sunday, November 16, 2025
Homeటెక్నాలజీLenovo Tab: మార్కెట్లోకి లెనోవా ట్యాబ్‌..డాల్బీ ఆటమ్స్ సౌండ్‌, 5,100mAh బ్యాటరీ.. ధర కూడా తక్కువే!

Lenovo Tab: మార్కెట్లోకి లెనోవా ట్యాబ్‌..డాల్బీ ఆటమ్స్ సౌండ్‌, 5,100mAh బ్యాటరీ.. ధర కూడా తక్కువే!

Lenovo Tab Launched: స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీలు ఫోన్లతో పాటు టాబ్లెట్ లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లో అనేక బ్రాండ్ టాబ్లెట్లు ఉండగా, తాజాగా లెనోవా తన కొత్త ఎంట్రీ-లెవల్ టాబ్లెట్ లెనోవా ట్యాబ్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. తక్కువ ధరలో అనేక అద్భుతమైన ఫీచర్లతో ఈ టాబ్లెట్ రావడం విశేషం. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పరికరానికి సంబంధించి ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

Lenovo Tab ధర:
కంపెనీ లెనోవా ట్యాబ్‌ 4GBర్యామ్+ 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999గా పేర్కొంది. ఇదే ర్యామ్, నిల్వతో Wi-Fi + LTE మోడల్ ధర రూ. 12,999గా నిర్ణయించింది. ఇక ఈ పరికరం 4GB ర్యామ్+128GB స్టోరేజ్ వేరియంట్ Wi-Fi వెర్షన్ రూ. 11,998కి అందుబాటులో ఉంటుంది. కాగా, ఇది పోలార్ బ్లూ కలర్ ఆప్షన్‌లో లభిస్తోంది.

Lenovo Tab లభ్యత:
ఈ పరికరాన్ని లెనోవో.కామ్, లెనోవో ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు.

 

Lenovo Tab ఫీచర్లు:

Lenovo Tab డిస్ప్లే:
ఈ ట్యాబ్ 10.1-అంగుళాల పూర్తి-HD (1,200×1,920 పిక్సెల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్, 400 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. డిస్‌ప్లే తక్కువ నీలి కాంతి ఉద్గారానికి TÜV సర్టిఫికేషన్‌ను పొందింది.

Lenovo Tab ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్:
ఇందులో ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G85 చిప్‌సెట్ ను అమర్చారు. ఇది 4GB LPDDR4X RAM, గరిష్టంగా 128GB eMMC నిల్వను కలిగి ఉంటుంది.

Also Read: Vivo V60 vs OnePlus Nord 5: వన్‌ప్లస్ నార్డ్ 5 vs వివో V60..ఏది కొంటె బెస్ట్..?

Lenovo Tab సాఫ్ట్‌వేర్:
లెనోవా ట్యాబ్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత లెనోవా ZUI 16 పై నడుస్తుంది. కంపెనీ దీనికి రెండు సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లు, నాలుగు సంవత్సరాల భద్రతా ప్యాచ్‌లను అందిస్తుంది.

Lenovo Tab కెమెరా:
ఫోటోగ్రఫీ కోసం..లెనోవా 8-మెగాపిక్సెల్ వెనుక కెమెరాను పొందుతుంది. ఇక సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం..5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇది డాల్బీ అట్మాస్ ట్యూనింగ్, మెటల్ బాడీ డిజైన్‌తో కూడిన డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంటుంది.

Lenovo Tab బ్యాటరీ:
లెనోవా ట్యాబ్‌ 5,100mAh బ్యాటరీతో 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీని పరిమాణం 9.5×235.7×154.5mm.

Lenovo Tab కనెక్టివిటీ ఫీచర్లు:
కనెక్టివిటీ పరంగా.. బ్లూటూత్ 5.3, Wi-Fi 5 మద్దతు ఉంటుంది. భద్రత కోసం..ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందించారు. ఈ టాబ్లెట్ ఇన్‌బిల్ట్ కిక్‌స్టాండ్‌తో క్లియర్ కేస్‌తో వస్తుంది. స్టాండ్‌బై మోడ్‌లో దీనిని డిజిటల్ ఫోటో ఫ్రేమ్ లేదా క్లాక్‌గా మార్చవచ్చని లెనోవా వెల్లడించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad