Sunday, November 16, 2025
Homeటెక్నాలజీVivo V60 vs OnePlus Nord 5: వన్‌ప్లస్ నార్డ్ 5 vs వివో V60..ఏది...

Vivo V60 vs OnePlus Nord 5: వన్‌ప్లస్ నార్డ్ 5 vs వివో V60..ఏది కొంటె బెస్ట్..?

Vivo V60 vs OnePlus Nord 5 Smart phones: వివో ఇటీవల తన V-సిరీస్ కింద కొత్త V60 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 40,000 కంటే తక్కువే! అయితే, ఈ ధర రేంజ్ లో మార్కెట్లో ఇప్పటికే పోకో F7, ఐక్యూ నియో 10, రియల్‌మీ జిటి 7 వంటి స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి వివో V60కు గట్టి పోటీని ఇస్తున్నాయి. ఇదే సమయంలో దాదాపు ఇదే ధరకు వన్‌ప్లస్ నార్డ్ 5 కూడా వివో ఫోన్‌కు గట్టి పోటీని ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇకవేళ ఇదే ధరలో కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ రెండింట్లో ఏది కొనాలో గందరగోళంగా ఉంటె ఈ కధనం చదవాల్సిందే. ఇప్పుడు ఏ స్మార్ట్‌ఫోన్ ఉత్తమ ఎంపికగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

- Advertisement -

 

Vivo V60 vs OnePlus Nord 5 ధర:

ఈ రెండు ఫోన్ల ధరల గురించి మాట్లాడితే..వినియోగదారులు వివో V60 స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్+ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 36,999కు కొనుగోలు చేయొచ్చు. అలాగే వన్‌ప్లస్ నార్డ్ 5 పరికరం 8GBర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,499కు అందుబాటులో ఉంది.

Vivo V60 vs OnePlus Nord 5: డిస్ప్లే

వివో పరికరం 6.77-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అయితే వన్‌ప్లస్ నార్డ్ 5 స్మార్ట్ ఫోన్ బిగ్ 6.83-అంగుళాల అమోలేడ్ ప్యానెల్‌ను కలిగి ఉంది. వివో 120Hz రిఫ్రెష్ రేట్, 5,000nits వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. అలాగే, పనే ప్లస్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 1,800nits వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.

Also Read: Mobiles under 12K: కొత్త ఫోన్ కొనాలా? రూ.12 వేల కంటే తక్కువ బడ్జెట్ లో మోటరోలా ఫోన్లు..

Vivo V60 vs OnePlus Nord 5: ప్రాసెసర్

వివో నుండి వచ్చిన ఈ గొప్ప పరికరం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 4 ప్రాసెసర్‌ను పొందుతోంది. అయితే వన్ ప్లస్ పరికరం మరింత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8s జనరేషన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. బెంచ్‌మార్క్ పరీక్షలు కూడా నార్డ్ 5 పరికరం V60 కంటే మెరుగైన పనితీరును అందించగలదని చూపిస్తున్నాయి. వివో V60 AnTuTuలో 1 మిలియన్ స్కోర్‌లను పొందగా,వన్ ప్లస్ నార్డ్ 5 1.4 మిలియన్ స్కోర్‌లను తెస్తుంది.

Vivo V60 vs OnePlus Nord 5: కెమెరా

వివో V60జీస్ సహకారంతో రూపొందించిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ పరికరంలో 50-మెగాపిక్సెల్ సోనీ IMX766 ప్రైమరీ సెన్సార్, 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 టెలిఫోటో లెన్స్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం.. ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.

మరోవైపు.. వన్‌ప్లస్ నార్డ్ 5 డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. దీనిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50-మెగాపిక్సెల్ సోనీ LYT-700 సెన్సార్, 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం..ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది.

Vivo V60 vs OnePlus Nord 5: బ్యాటరీ

వివో ఫోన్ 90W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో బిగ్ 6,500mAh బ్యాటరీతో పొందుతోంది. మరోవైపు.. వన్ ప్లస్ నార్డ్ 5 మెరుగైన 6,800mAh బ్యాటరీని పొందుతుంది. ఇది 80W సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు మాత్రమే మద్దతు ఇస్తుంది. మొత్తంమీద ఫీచర్ల పరంగా..వన్ ప్లస్ మెరుగైన ఎంపికగా కనిపిస్తోంది. అయితే, అవసరానికి అనుగుణంగా ఏదైనా ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad