PVC Aadhaar Card download with easy steps: నేటి డిజిటల్ యుగంలో ఆధార్ కార్డు అతి ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారింది. బ్యాంక్ ఖాతా తెరవడం నుండి, ప్రభుత్వ పథకాలు పొందే వరకు ప్రతిచోటా ఆధార్ నంబర్ తప్పనిసరి. ఒక్క ఆధార్‌తో దేశంలో ఎటువంటి సేవలనైనా పొందవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ తమ వ్యాలెట్‌లో ఆధార్ కార్డు క్యారీ చేస్తుంటారు. అయితే, ఇంతటి ప్రాముఖ్యత గల ఆధార్ చిరిగిపోతే, దెబ్బతింటే ఎంతటి అసౌకర్యం కలుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే, ప్రతిఒక్కరూ ఆధార్ పీవీసీ కార్డును తీసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ పీవీసీ కార్డులను పొందడం చాలా సులభం. ఇంటి నుండే కొత్త ఆధార్ కార్డును పొందవచ్చు. యూఔడీఏఐ ప్రజల సౌలభ్యం కోసం ఆన్‌లైన్ సేవను ప్రారంభించింది. డూప్లికేట్ ఆధార్ కార్డు పొందడానికి ప్రభుత్వ కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేకుండా నేరుగా డౌన్‌లోడ్ చేసుకొని, కార్డును పొందే వెలుసుబాటు కల్పిస్తోంది. ఆ ప్రక్రయ గురించి తెలుసుకుందాం.
ఆధార్ పీవీసీ కార్డు పొందే ప్రక్రియ..
ముందుగా మీరు యూఐడీఏఐ వెబ్‌సైట్ https://uidai.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. అందులో నుండి మీ ఈ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, PVC ఆధార్ కార్డును ఆర్డర్ చేయండి. ఇందుకోసం, మీకు కావలసిందల్లా మీ ఆధార్ నంబర్ (UID), ఎన్‌రోల్‌మెంట్ నంబర్ లేదా వర్చువల్ ID (VID) మాత్రమే. డూప్లికేట్ ఆధార్ కార్డ్ విషయానికి వస్తే.. డూప్లికేట్ ఆధార్ కార్డు అనేది మీ పాత ఆధార్ కార్డు కాపీ. ఇందులో అసలు ఆధార్ నంబర్, వివరాలు ఉంటాయి. ఆధార్ కార్డు పోగొట్టుకున్న వారికి, కార్డు దెబ్బతిన్న వారికి ఈ కార్డు చాలా ఉపయోగపడుతుంది. కేవలం రూ. 50కే పీవీసీ ఆధార్ కార్డును పొందవచ్చు. మీరు ఏటీఎం కార్డు లాగా కనిపించే మన్నికైన, వాటర్‌ప్రూఫ్ కార్డ్ కావాలనుకుంటే, దాన్ని కేవలం రూ.50 కి ఆర్డర్ చేయవచ్చు.
ఈ-ఆధార్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం..
1. ముందుగా UIDAI వెబ్‌సైట్ uidai.gov.in కి వెళ్లండి.
2. “డౌన్‌లోడ్ ఆధార్” ఎంపికపై క్లిక్ చేయండి.
3. ఇప్పుడు మీ ఆధార్ నంబర్ (UID), EID లేదా VIDని నమోదు చేయండి.
4.స్క్రీన్‌పై ప్రదర్శించబడే క్యాప్చా కోడ్‌ను పూరించి, సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి.
5. మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేయండి.
6. డౌన్‌లోడ్ ఆధార్‌పై క్లిక్ చేసిన వెంటనే మీ ఈ-ఆధార్ పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది.
పీవీసీ ఆధార్ కార్డు కావాలంటే..
1. యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్‌పై క్లిక్ చేయండి.
2. మీ ఆధార్ నంబర్ (UID)ని ఎంటర్ చేసి, క్యాప్చాని పూరించండి.
3. “Send OTP”పై క్లిక్ చేసి, ఓటీపీని ఎంటర్ చేయండి.
4. మీ ఆధార్ ప్రివ్యూ ఇప్పుడు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
5. యూపీఐ, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.50 చెల్లింపు చేయండి.
6. చెల్లింపు విజయవంతం అయిన తర్వాత మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది. ఈ పీవీసీ కార్డు స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటికే వస్తుంది.


