Sunday, November 16, 2025
Homeటెక్నాలజీRealme C71 5G: 6300mAh బ్యాటరీతో రియల్‌మీ C71 లాంచ్.. ధర కేవలం రూ.7,699 మాత్రమే!

Realme C71 5G: 6300mAh బ్యాటరీతో రియల్‌మీ C71 లాంచ్.. ధర కేవలం రూ.7,699 మాత్రమే!

Realme C71 5G Launched: రియల్‌మీ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. రియల్‌మీ Realme C71 పేరిట దీని రిలీజ్ చేసింది. బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. 6,300mAh బిగ్ బ్యాటరీ అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 10 వేల కంటే తక్కువ ధరలో కొనుగోలుకు ఉండటం విశేషం. AI- ఆధారిత ఇమేజింగ్, ఎడిటింగ్ సాధనాలను కలిగి ఉన్న ఈ పరికరం ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

Realme C71 5G ధర:

రియల్‌మీ కొత్త C71 5G పరికరం 4GB + 64GB వేరియంట్ స్టోరేజ్ ధర రూ.7,699గా, 6GB + 128GB వేరియంట్ స్టోరేజ్ ధర రూ.8,699గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ అబ్సిడియన్ బ్లాక్, సీ బ్లూ రంగులో వస్తుంది. ఇది ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంది.

 

Also Read: HMD T21 Tablet: బ‌డ్జెట్ ధ‌ర‌లోనే HMD T21 టాబ్లెట్.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

Realme C71 5G ఫీచర్లు:

Realme C71 5G స్మార్ట్ ఫోన్ 6.74-అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 563 nits బ్రైట్‌నెస్ లెవల్‌ అందించారు. ఈ మొబైల్ 6GB వరకు RAM, 128GB వరకు నిల్వతో లభిస్తోంది. ఇందులో ఆక్టా-కోర్ 12nm Unisoc T7250 ప్రాసెసర్ ను అమర్చారు. ఈ పరికరం ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Realme UI 6 తో పనిచేస్తుంది.

ఇక కెమెరాల గురించి మాట్లాడితే..Realme C71 5G వెనుక భాగంలో 13-మెగాపిక్సెల్ OmniVision OV13B సెన్సార్ ఉంది. ఇది ఆటోఫోకస్ సపోర్ట్, f/2.2 ఎపర్చర్‌తో వస్తుంది. ముందు భాగంలో ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం..5-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ HD వీడియో రికార్డింగ్, AI ఎరేజర్, AI క్లియర్ ఫేస్, ప్రో మోడ్, డ్యూయల్-వ్యూ వీడియో వంటి ఇతర ఫీచర్లకు సపోర్ట్ ఇస్తుంది.

బ్యాటరీ గురించి చెప్పాలంటే..ఈ పరికరం15W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 6W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌తో 6,300mAh బిగ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. Realme C71 5G మొబైల్ మిలిటరీ-గ్రేడ్ MIL-STD-810H షాక్-రెసిస్టెంట్, IP54-రేటెడ్ డస్ట్, వాటర్-రెసిస్టెంట్ బిల్డ్‌ను కూడా అందిస్తుంది. ఇకపోతే కనెక్టివిటీ పరంగా ఈ మొబైల్ లో 5జీ, 4జీ, Wi-Fi, బ్లూటూత్ 5.2, GPS, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక భద్రత కోసం.. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ కొలతలు 167.20×76.60×7.94mm. బరువు 201 గ్రాముల.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad