Narsingi Accident Video: హైదరాబాద్ శివారు నార్సింగిలో బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. రెడ్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న బైక్, కారును వేగంగా వచ్చిన లగ్జరీ కారు ఢీకొట్టడంతో ఓ మహిళ బైక్ పై నుంచి గాల్లోకి ఎగిరిపడింది. నార్సింగి పరిధిలోని మై హోమ్ అవతార్ ఎదురుగా ఉన్న సర్కిల్ వద్ద శుక్రవారం(అక్టోబర్ 4న) సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read: https://teluguprabha.net/crime-news/son-killed-mother-in-proddatur/
ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మై హోమ్ అవతార్ ఎదురుగా సర్కిల్ వద్ద రెడ్ సిగ్నల్ పడటంతో ఆగి ఉన్న బైక్, కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న మహిళ గాల్లోకి ఎగిరిపడటంతో బలంగా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం మహిళను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Also Read: https://teluguprabha.net/crime-news/road-accident-at-chityal-on-vijayawada-hyderabad-highway/
కాగా ఘటనలో కారు, బైక్ దెబ్బతిన్నాయి. బీఎండబ్ల్యూ కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా అతి వేగంగా వచ్చి ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినట్లు చెబుతున్నారు. ఘటన జరిగిన అనంతరం నిందితుడు కారు వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


