Sunday, November 16, 2025
HomeతెలంగాణAnirudh Reddy: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అందరికీ ఇల్లు

Anirudh Reddy: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అందరికీ ఇల్లు

కాంగ్రెస్ తోనే వెలుగులు..

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇల్లు లేని ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణం కోసం రూ 5 లక్షలు ఇస్తామని జడ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి అనిరుద్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన నవాబ్ పేట్ మండలంలోని కారూర్ గ్రామంలో పర్యటించారు. గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకోని దేవాలయం పూజారితో ఆశీర్వాదం పొందారు. గ్రామంలోని ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు.

- Advertisement -

బీఆర్ఎస్ చెప్పుకుంటున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడా కనబడటం లేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి సమన్యాయం జరుగుతుందని, చదువుకున్న మన పిల్లలలకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ప్రజలకు వివరించారు. మహిళల ఆత్మగౌరవం నిలిచేలా ప్రతినెలా రూ 2500 గౌరవ భృతి ఇస్తామని, మహిళా మణులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad