Wednesday, April 2, 2025
Homeచిత్ర ప్రభBandla Ganesh: ప్రాణం పోయినా కానీ.. బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

Bandla Ganesh: ప్రాణం పోయినా కానీ.. బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

Bandla Ganesh| సీనియర్ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రాణం పోయినా కానీ బీఆర్ఎస్‌ పార్టీని పొగడనని హాట్ కామెంట్స్ చేశారు. గతంలో రాష్ట్రాన్ని శాసిస్తున్న బీఆర్ఎస్(BRS) ప్రభుత్వానికి ఎదురు తిరిగానని గుర్తు చేశారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ విధేయుడనని.. 2000 సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉంటున్నానని తెలిపారు.

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అంటే తనకు ఎంత ఇష్టం అంటే.. తన ఆరాధ్య నటుడు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా పార్టీ మారలేదన్నారు. అలాగే తన దేవుడు, సన్నిహితుటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఆ పార్టీలోకి పోలేదని పేర్కొన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీ అంటే అంత అభిమానం అని స్పష్టం చేశారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాత్రమే అని కొనియాడారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయనలో ఎలాంటి అహం లేదని బండ్ల వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News