ఎన్నికలు వస్తే ఆగం కావద్దని, ఆలోచించి కారు గుర్తుకే ఓటు వేయాలని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నారపాక రమేష్ అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ బిఅర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ కి మద్దతుగా బీర్ పూర్ మండలంలోని చిత్రవేని గూడెం, తాళ్ళ ధర్మారం గ్రామాలలో ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు ఇస్తూ, ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న వారిదగ్గరికి వెళ్లి బిఅర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను వివరిస్తూ, ప్రతిపక్ష పార్టీల అబద్ధపు హామీలను ఎండగడుతూ, బీఆర్ఎస్ కార్యకర్తల ఎన్నికల ప్రచారం నిర్వచించారు బీర్ పూర్ మండల నాయకులు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నరపాక రమేష్, మాజి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నల్ల మహిపాల్ రెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు గాజర్ల రాంచందర్ గౌడ్,మాజి సర్పంచ్ చిక్రం మారుతి, గ్రామ శాఖ అధ్యక్షులు చల్ల లక్ష్మణ్, సిడెం బిలాజీ రావు, పుడూరి సుధాకర్, నాయకులు చిక్రాం భీము, తొడసం బాదిరావు, కుడిమేత గంగారాం, బర్ల శ్రీనివాస్, అరికిళ్ల పోచయ్య, సదాల సంజీవ్, నల్ల గంగారెడ్డి, బద్ది భీమయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.