Friday, September 20, 2024
HomeతెలంగాణChevella: ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి

Chevella: ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి

బీజేపీ ఆధ్వర్యంలో బాపూజి వర్ధంతి

కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని చేవెళ్ల మండల కేంద్రంలో బిజెపి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మండల ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి మాట్లాడుతూ… కొండ లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర సమర యోధుడని తెలంగాణ సాధన సమితి నేత అని గొప్ప తెలంగాణవాది అన్నారు. తెలంగాణ ప్రజలు నిజాం నిత్య అకృత్యాలకులోనై ఉండటాన్ని చూసి ఉండలేక విమోచన ఉద్యమంలో పోరాడారన్నారు. నిజాం పై బాంబులు విసిరిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ 1967లో భువనగిరి నియోజకవర్గంలో విజయం సాధించి కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రి వర్గం కేబినెట్ లో చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారన్నారు.1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాడారన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా మండల ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు కుంచం శ్రీనివాస్ బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ అల్లవాడ శ్రీనివాస్ రెడ్డి బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గుడిపల్లి మధుసూదన్ రెడ్డి బీజేవైఎం ఉపాధ్యక్షులు చేగూరి ప్రవీణ్ రెడ్డి గుర్రాల మహేశ్వర్ రెడ్డి శేరి బాలరెడ్డి కృష్ణమోహన్ దళిత మోర్చా అధ్యక్షుడు యర్రవల్లి అశోక్ బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు బండారి చంద్రశేఖర్ రెడ్డి ఐటీ సేల్ మండల్ ప్రెసిడెంట్ అల్లాడ అభిషేకర్ రెడ్డి ఉబ్బటి సత్యం జయసింహ నల్ల నవీన్ రెడ్డి చాకలి శ్రీనివాస్ పెద్దోళ్ల కృష్ణ నరేష్ దామోదర్ చారి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News