Friday, September 20, 2024
HomeతెలంగాణChevella: ప్రజా ఆరోగ్యమే 'ఆరోగ్య రథం' లక్ష్యం

Chevella: ప్రజా ఆరోగ్యమే ‘ఆరోగ్య రథం’ లక్ష్యం

ఉచిత వైద్య సేవలు వినియోగించుకోండి

చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా సొంత నిధులతో “ఆరోగ్య రథం” ప్రారంభించారు. గత కొంతకాలంగా గ్రామాల వారిగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. చేవెళ్ల మండలం కమ్మెట గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆరోగ్య రథం కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నియోజకవర్గ ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ఎంపీ ఆరోగ్య రథాన్ని ప్రారంభించారన్నారు. ప్రజలు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం ఉండరాదు అన్నారు. ఆరోగ్య రధంలో అన్ని రకాల పరీక్షలు నిర్వహించి మందులను ఉచిత పంపిణీ చేస్తారన్నారు. పెద్ద ఆరోగ్య సమస్య ఉంటే చేవెళ్లలోని పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. పెద్దమనుషులు యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

- Advertisement -

సెప్టెంబర్ 16 శనివారం కొందుర్గులో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభిస్తారని ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. కృష్ణానది జలాలను రంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలను సస్యశ్యామలం అయితే అని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్గరి విజయలక్ష్మి రమణారెడ్డి, సర్పంచ్ తులసి రాజు, మాజీ సర్పంచ్ మండల ప్రధాన కార్యదర్శి హన్మంతు రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, గ్రామ అధ్యక్షులు అంజన్ గౌడ్, బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్, ఏఎంసి డైరెక్టర్ శ్రీనివాస్, సురేందర్ గౌడ్, పోచయ్య, గోవర్ధన్ అంతయ్య గౌడ్, మాజీ ఎంపీటీసీ, పెంటయ్య, కృష్ణ గౌడ్ మాజీ సర్పంచ్ పెంటయ్య, వెంకటేష్, అంతయ్య గౌడ్ నరసింహులు, గడ్డమీద శేఖర్ వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News