చేవెళ్లను మున్సిపాలిటీగా చేస్తామని స్థానిక ఎంపీ ఎమ్మెల్యే ప్రకటన అనంతరం మున్సిపాలిటీపై గ్రామాల ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్ళ మున్సిపాలిటీలో కలిపే 10 గ్రామ పంచాయతీల ప్రజలు పెద్దయెత్తున చేవెళ్ళ మండలకేంద్రంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతున్న జనరల్ బాడీ మీటింగ్ ముట్టడించారు. గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో కలపకుండా తీర్మానం చేయాలని స్థానిక ఎంపీపీ ఎంపీడీఓలకు వినతిపత్రం సమర్పించారు. మున్సిపాలిటీ వద్దురా… గ్రామపంచాయతీ ముద్దురా.. అని ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. గ్రామపంచాయతీలను అభివృద్ధి చేయమన్నాము కానీ మున్సిపాలిటీలో కల్పన లేదన్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ…. అధికార వికేంద్రీకరణ చెయ్యాలని కొత్తగా జిల్లాలు మండలాలు గ్రామ పంచాయతీలను చేస్తున్న ప్రభుత్వం కొత్తగా అన్ని గ్రామాలను కలిపి చేవెళ్ళ మున్సిపాలిటీ చేస్తామనడం విడ్డురమన్నారు. చేవెళ్ళను మున్సిపాలిటీ చెయ్యడానికి మాగ్రామాల ప్రజలకు ఎలాంటి అభ్యంతరం లేదని కానీ చేవెళ్ళ మున్సిపాలిటీలో మా పది గ్రామాలను కలుపొద్దని అన్నారు. మున్సిపాలిటీలో కలిపితే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రైతులు చాలా ఇబ్బంది పడతారన్నారు.
మున్సిపాలిటీ అయితే ఇంటి పన్ను పెరుగుతాయని ఉపాధిహామీ పథకం రద్దవుతుందని చుట్టుపక్కల గ్రామాలలో సుమారు ఆరు వేలమంది జాబ్ కార్డు ఉండీ ఉపాధి అవకాశాలు కోల్పోతారన్నారు. గ్రామాల ప్రజా బిప్రాయాన్ని పట్టించుకోకుండా మున్సిపాలిటీలో చుట్టుపక్కల గ్రామాలను కలిపి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్నారు. ఈ కార్యక్రమంలో దామరగిద్ద మాజి సర్పంచ్ మధుసూదన్ గుప్తా పామేన మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి ,ఇబ్రాహీంపల్లి సొసైటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి,దేవుని ఎర్రవల్లి మాజీ ఎంపీటీసీ చెంద్రయ్య, పామేన సొసైటీ డైరెక్టర్ రాములు పదిగ్రామాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.