సార్వత్రిక ఎన్నికల సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా కృషి చేస్తామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ అన్నారు. మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ….ఓటర్లలో నమ్మకం కలిగించడానికి, ప్రశాంతమైన వాతావరణం కోసం ప్లాగ్ మార్చ్ నిర్వహించామన్నారు. పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి, గడియారం చౌరస్తా, డీఎం అండ్ హెచ్ ఓ ఆఫీస్, రామ మందిర్ చౌరస్తా, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, భగీరథ కాలనీ కమాన్, పసుల కృష్ణారెడ్డి గార్డెన్, ఎస్ ఎస్ గుట్ట, న్యూ టౌన్, బస్టాండ్ మీదుగా తెలంగాణ చౌరస్తా వరకు 10 కిలోమీటర్లు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఫ్లాగ్ మార్చ్ అనేది విధి నిర్వహణలో ఒక భాగం ..ఓటర్లలో ముఖ్యంగా నమ్మకాన్ని కలిగించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడడం పోలీసుల బాధ్యత అన్నారు.
ప్రజలు రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కరూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకారం అందించాలని, ఎన్నికలకు ఆటంకం కలిగించే చర్యలను తాము ఉపేక్షించేది లేదని, పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూనే తమ విధి నిర్వహణ పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని తెలిపారు.
Flag March: మహబూబ్నగర్ లో ఫ్లాగ్ మార్చ్
ఓటర్లలో నమ్మకాన్ని కలిగించడానికి..