Friday, April 4, 2025
HomeతెలంగాణGandipeta: చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు ఖాయం

Gandipeta: చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు ఖాయం

కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మైలారం ప్రదీప్ కుమార్

చేవెళ్ల పార్లమెంటు ఎన్నికలలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు ఖాయమని నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మైలారం ప్రదీప్ కుమార్ అన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తుందన్నారు. ఈ విషయంలో ఎవరికి ఎటువంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ప్రారంభించడంతో పెద్ద ఎత్తున రాష్ట్రంలోని మహిళలు సౌకర్యాన్ని ఉపయోగించుకొని, పెద్ద ఎత్తున ఆనందపడుతున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి స్పష్టంగా కనబడుతుందని వెల్లడించారు. ఈ పార్లమెంట్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News