జిన్నారం మండల పరిధిలోని అండూరు గ్రామంలో నిర్వహించిన బోనాల ఉత్సవం కన్నుల పండువగా సాగింది. ఒగ్గు కళాకారుల నృత్యాలు, డబ్బు చప్పుళ్ళు, కోలాటం, నృత్యాలతో గ్రామస్తులు, గ్రామ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఘన స్వాగతం పలికారు. గ్రామ ముఖద్వారం నుండి దేవాలయం వరకు అడుగడుగునా తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోనాల పండుగ సందర్భంగా ఆత్మీయ స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి ఆయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అభిమానంతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నామని తెలిపారు. ప్రతి మనిషి కష్టనష్టాల్లో అండగా ఉంటూ వారికి మేమున్నామంటూ భరోసా ఇస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, గ్రామ సర్పంచ్ ఖదీర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.