తెలంగాణలో గ్రూప్ 1(Group 1) నియామకాలకు లైన్ క్లియర్ అయింది. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టులపై 2024 ఫిబ్రవరిలో టీజీపీఎస్సీ(TGPSC) నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 2024లో ప్రిలిమినరీ పరీక్ష.. అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు 2024, మార్చి 10న ప్రకటించగా.. మార్చి 30న జనరల్ ర్యాంక్స్ ప్రకటించారు. అయితే ఈ నోటిఫికేషన్‌లో జీవో నెం.29 ద్వారా తమకు అన్యాయం జరుగుతోందని కొంతమంది అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో గ్రూప్ 1 పోస్టుల నియామకాలకు అడ్డంకులు తొలగిపోయాయి.