కస్టమర్లకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలో బస్టాండ్ ఎదురుగా సిల్వర్ బావర్చి హోటల్ ను వారు ముఖ్య అతిథిలుగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అందరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూడకుండా స్వయం ఉపాధి పొందితే నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. పరిశుభ్రమైన పదార్థాలను సరసమైన ధరలకు ప్రజలకు అందించాలని సూచించారు. హోటల్ యజమాని మధుసూదన్ రెడ్డిని ఎమ్మెల్యేలు అభినందించారు. హోటల్ యజమాని మధుసూదన్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాపారావు, జడ్పిటిసి గోవిందమ్మ గోపాల్ రెడ్డి, తోపు గొండ సర్పంచ్ గోపాల్ రెడ్డి, నాయకులు గోపాల్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.