హుజూర్ నగర్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జిగా నేరేడుచర్లకు చెందిన సరికొప్పుల నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియామక పత్రాన్ని అందజేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడమే జనసేన లక్ష్యమని అన్నారు. అనంతరం నియోజకవర్గ ఇంచార్జ్ సరికొప్పుల నాగేశ్వరరావు మాట్లాడుతూ హుజూర్ నగర్ కార్యనిర్వాహకులుగా ఉన్న నాకు నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పజెప్పడం చాలా ఆనందంగా ఉందన్నారు. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడమే జనసేన లక్ష్యంగా జనసేన పార్టీ భలమైన శక్తిగా మారుతుందని అన్నారు. జనసేన భావజాలానికి ఆకర్షితులైన యువత ప్రతి గ్రామంలో ఉన్నారని, ఆ భావాన్ని పట్టుకునే ముందుకు వెళ్లి ప్రతి గ్రామంలో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించినందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్, రామ్ తాళ్లూరి,
మేకల సతీష్ రెడ్డి, హుజూర్ నగర్ జనసేన సైనికులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు.
Huzurnagar: నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జిగా నాగేశ్వరరావు
తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడమే జనసేన లక్ష్యంగా జనసేన పార్టీ భలమైన శక్తిగా మారుతుంద