హై బిజ్ టీవీ రియల్టీ అవార్డ్స్(Hybiz Awards) రెండో ఎడిషన్ అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ నోవాటెల్ ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమంలో భాగంగా… రియల్టీ సెక్టార్‌లో విశేష సేవలు అందిస్తున్న సంస్థలు, వ్యక్తులకు 40కి పైగా అవార్డులను అందజేశారు. 12 మందికి లెజెండ్ పురస్కారం దక్కింది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు, నిర్మాత, పొలిటీషియన్, వ్యాపారవేత్త మురళీమోహన్(Murali Mohan)తో పాటు అమీర్ అలీ ఖాన్ (ఎమ్మెల్సీ & న్యూస్ ఎడిటర్ – ది సియాసత్ డైలీ), సి. శేఖర్ రెడ్డి (నేషనల్ వైస్ ఛైర్మన్ – ఐజీబీసీ-సీఐఐ), వి. రాజశేఖర్ రెడ్డి (ప్రెసిడెంట్ – క్రెడాయ్ హైదరాబాద్), విజయ్ వర్ధన్ రావు (సీనియర్ ప్రెసిడెంట్ – మార్కెటింగ్, మహా సిమెంట్), వి. నరసింహా రెడ్డి (డైరెక్టర్ – వీరా ఆర్ఎంసీ), ఎం. రాజ్ గోపాల్ (మేనేజింగ్ డైరెక్టర్ – హై బిజ్ టీవీ & తెలుగు నౌ), డాక్టర్ జె. సంధ్యారాణి (మేనేజింగ్ డైరెక్టర్ – హై బిజ్ టీవీ ఎల్.ఎల్.పి) తదితరులు పాల్గొన్నారు.


రియల్ ఎస్టేట్ రంగంలో విశేష కృషి చేస్తున్న వారిని గుర్తించి హై బిజ్ టీవీ అవార్డులను ఇవ్వడం హర్షించదగ్గ విషయమని మురళీ మోహన్ చెప్పారు. వారికిది ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన హై బిజ్ టీవీని అభినందించారు. ఇక భారతదేశం గర్వించదగ్గ కన్ స్ట్రక్షన్స్ హైదరాబాద్‌లో జరుగుతున్నాయని తెలిపారు. నగరంలో ఒకప్పుడు నిర్మాణ పనుల కోసం మలేషియా, సింగపూర్, దుబాయ్‌కి చెందిన సంస్థలు పని చేసేవని.. కానీ ఇప్పుడు మనమే అత్యద్భుత నిర్మాణాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. మరో రెండేళ్లలో 100 ఫ్లోర్ల భవనాలు ఇక్కడ ఏర్పాటవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే ఇప్పుడు వెంచర్ కన్ స్ట్రక్షన్‌లో, మౌలిక సదుపాయాల కల్పనలో చాలా మార్పులొచ్చాయని చెప్పారు. ఇది శుభపరిణామమని సంతోషం వ్యక్తం చేశారు.


రియల్టీ రంగంలో విశేషకృషి చేస్తున్న వారికి హై బిజ్ టీవీ అవార్డులను ఇవ్వడం ఇది రెండో సారి కావడం విశేషం. గత ఏడాది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టింది. ఈసారి సెకండ్ ఎడిషన్‌ను కూడా అదే విధంగా నిర్వహించింది. హై బిజ్ టీవీ రియల్టీ అవార్డ్స్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 8008074747 నంబర్‌లో సంప్రదించగలరు.