ఒత్తిడి లేని జీవన శైలి కొనసాగించగలగడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వంటి పలు అంశాలపై అవగాహన కలిగి సాగించే జీవన శైలిని అందరూ అవలంభించాలని ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సర్దార్ సూచించారు. ఆరోగ్యాన్ని కాపాడుకునే లైఫ్ స్టైల్స్ ను ఎంపిక చేసుకోవాలని ఆయన వివరించారు. ఏటా ఆగష్టు15 నాడు నిర్వహించే 77 వ భాతర స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అమీర్‌పేట ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వినూత్నమైన బైక్ ర్యాలీ నిర్వహించారు.
శక్తివంతమైన ఆరోగ్యకర జీవన శైలి సాధించడం నినాదంతో నిర్వహించిన ఈ బైక్ ర్యాలీ, ఉదయం 6 గంటలకు అమీర్‌పేట ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ నుండి ప్రారంభమై ట్యాంక్ బండ్ వరకూ వెళ్లి తిరిగి అమీర్ పేటకు చేరుకొనేలా నిర్వహించారు. ఈ సందర్భంగా డా. సర్దార్ మాట్లాడుతూ జీవితంలో ఎన్నో రకములైన పనులు చేయడానికి అవసరమైన స్వాతంత్రాన్ని అంతేగాకుండా మన శరీరం పలు సందర్భాలలో మనలను ఆరోగ్య సంబంధిత అంశాలపై హెచ్చరికలు జారీచేస్తుందన్నారు. వాటిని నిర్లక్ష్యం చేయకుండా గమనిస్తూ అవసరమైతే నిపుణులైన వైద్యులను సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ బైక్ ర్యాలీలో యల్ కె సన్నీ సింగ్, బైకర్స్ క్లబ్ సౌత్ జోన్ మోడరేటర్ పి.జాన్, సరబేరుస్ మోటార్ సైక్లింగ్ క్లబ్ ఫౌండర్ శివన్ కుట్టీ, రైడర్స్ కమ్యూనిటీ అఫ్ ఇండియా సౌత్ ఇండియా హెడ్ శామ్, ఈరోనాహెడ్స్ ఇండియా సీనియర్ మెంబెర్లతో పాటు కె.అనిల్ రాజ్, నజీర్ ఖాన్,ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సాయి ఛైతన్య, ప్రియాంక ప్రియదర్శినితో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.