రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్గా నియమించిన సందర్భంగా పులిమామిడి నారాయణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి సెక్రెటరియేట్ లో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ గా నియమితులైన పులిమామిడి నారాయణ మాట్లాడుతూ… తమను గుర్తించి చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉంటానన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికి వమ్ము కానీయనన్నారు. పార్టీ బలోపేతానికి మరింత కష్టపడి పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా కృషి చేస్తానన్నారు. బిఆర్ఎస్ పార్టీలో గత 13 సంవత్సరాలుగా క్రమశిక్షణతో పనిచేశానన్నారు. భవిష్యత్తులో అదే విధంగా కేసీఆర్ అడుగు జాడల్లో ఆయన ఆశయ సాధనకై పని చేస్తానన్నారు. కష్టపడి ఓపికతో పని చేస్తే బిఆర్ఎస్ పార్టీలో పదవులు తప్పక వస్తాయనే దానికి నా నియామకమే ఉదాహరణ అన్నారు. తమ నియామకానికి సహకరించిన మంత్రివర్యులు కేటీఆర్ మల్లారెడ్డి ఎమ్మెల్సీ కవిత పల్లా రాజేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Hyd: కేసీఆర్ కు థాంక్స్ చెప్పిన వేతనాల సలహా మండలి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


