Sunday, November 10, 2024
HomeతెలంగాణIllandukunta: అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం

Illandukunta: అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం

అమరవీరుల స్ఫూర్తితో కార్మికుల హక్కుల సాధన కోసం సంఘటితంగా ఉద్యమిద్దమని సిపిఎం జోన్ కమిటీ సభ్యులు చేల్పురి రాములు అన్నారు. ఇల్లందకుంట మండలంలోని ఇల్లందకుంట, మల్యాల, శ్రీరాములపల్లి, సిరిసేడు, వంతడుపుల, గ్రామాలలో సోమవారం ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చేల్పురి రాములు మాట్లాడుతూ 1886లో అమెరికాలోని చికాగో నగరంలో కార్మికుల హక్కుల కోసం కార్మిక వర్గం ఉద్యమిస్తే అక్కడి ప్రభుత్వం లాఠీచార్జి కాల్పులలో అమరులైన ఆ అమరవీరుల స్ఫూర్తితో జరుపుకునేది మేడే అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలను దారా దత్తంగా అంబానీ, ఆదానిలకు అంటగడుతూ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ 44 లేబర్ కోడులను ఉన్న చట్టాలను సవరిస్తూ నాలుగు లేబర్ కోడులుగా సవరిస్తూ కార్మిక వర్గ ఏకం కాకుండ చేస్తూ నేడు కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ చేప కింద నీరులాగా పనిగంటలు పెంచుకుంటూ పోతున్నారని మండిపడ్డారు.

- Advertisement -

ఈ కార్యక్రమాలలో సిపిఐ మండల కార్యదర్శి ఎం.రత్నాకర్, సిపిఎం జోన్ కమిటీ సభ్యులు తిప్పరపోయిన శ్రీకాంత్, శాఖా కార్యదర్శి కొత్తూరి మల్లయ్య, జమ్మకం వెంకన్న, సిలువేరు కొమురయ్య, మహేందర్, రాజు, గురుకుంట్ల కట్ట స్వామి, రాజేందర్, రమేష్, బాబు, కొమురయ్య, రాజయ్య, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News