Friday, September 20, 2024
HomeతెలంగాణIndurthi: ఎల్లమ్మ తల్లి జాతర

Indurthi: ఎల్లమ్మ తల్లి జాతర

చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో మాత మావురాల శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యణోత్సవమ్ సందర్భంగా ఎల్లమ్మ జాతర గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని ఉదయం నుండే భక్తులు బారులు తీరారు తండోప తండాలుగా కరీంనగర్ సిద్దిపేట జిల్లాలతో పాటు హైదరాబాద్ గోదావరిఖని భీమండి బాంబే బెంగళూరు తదితర పట్టణాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి కోరిన కోరికలు తీర్చే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు గ్రామంలో పోచమ్మ తల్లికి బోనాలతో పాటు ఎల్లమ్మ తల్లికి బోనాలు చెల్లించి నైవేద్యం సమర్పించే ఒడి బియ్యము పోసి మొక్కులు అప్పచెప్పారు. సాయంకాలం గౌడ కులస్తులు బోనాలతో డప్పు చప్పుల మధ్య డిజె సాంగ్స్ ఆటపాటలతో బైండ్ల వారి ఆటపాట మాటతో పాటు ఎల్లమ్మ తల్లి దేవాలయ ఆవరణ ప్రాంగణంలో మేక పిల్లలను గావ్ పట్టడం జాతర ప్రత్యేకత ఎల్లమ్మ తల్లి ఉదయం నుండే ప్రముఖులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శించుకోవడం జరిగింది గ్రామ సర్పంచ్ అందే స్వరూప పెద్ద స్వామి, లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ గాదే రఘునాథ్ రెడ్డి ప్రముఖ బిల్డర్ నందికొండ తిరుపతిరెడ్డి లు ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు వారికి గౌడ సంఘ నాయకులు అమ్మవారి కండువాతో ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా ఇందుర్తి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఎల్లమ్మ దేవాలయాన్ని రంగులతో సుందరీకరణ తీర్చిదిద్దడంతోపాటు మాత గుడి నిర్మించి దేవాలయ ఆవరణ చుట్టు చలువ పందిర్లు టెంటు లైటింగ్ సౌండ్స్ తోపాటు భక్తులకు చల్లని నీరును ఏర్పాటు చేయడం పట్ల గౌడ కులస్తులను అభినందించారు. దేవాలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఇంకెవరైనా దాతలు కూడా ముందుకు వచ్చి దేవాలయ అభివృద్ధిలో పాత్రులు కాగలరని కోరారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు గట్టు మొగిలి ఆకుల శ్రీను చెప్యాల మురళీ మనోహర్ గౌడ్ దుంబాల వెంకటేష్ గౌడ్ బుర్ర సత్యనారాయణ గౌడ్ తీగల శ్రీనివాస్ అరవింద్ గౌడ్ మురళి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News