Tuesday, May 14, 2024
HomeతెలంగాణJadcharla: కాంగ్రెస్ కు ఓట్లడిగే హక్కు లేదు

Jadcharla: కాంగ్రెస్ కు ఓట్లడిగే హక్కు లేదు

డీకే అరుణ

ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కు లేదని మహబూబ్ నగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి డీకే అరుణ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డీకే అరుణ జడ్చర్ల నియోజకవర్గంలోని సూరారం, పోలేపల్లి, కిష్టారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు మోసాలను ఎండగడుతూ డీకే అరుణ సెటైర్లు వేశారు. గ్రామాల్లో అరుణమ్మకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. బ్యాండ్ మేళాలు, ఆటపాటలు, పటాకుల మోతలతో జన నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ పచ్చని తెలంగాణను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని, పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి కరువు తెచ్చిందన్నారు. గత ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు అంటూ కాంగ్రెస్ మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిందని, ఇంకా నమ్మితే మోసపోతామని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

- Advertisement -

బిజెపితోనే నిరుపేదలకు న్యాయం జరుగుతుందని, నన్ను నమ్మి బీజేపీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే సూరారం, పోలేపల్లి ప్రజల కష్టాలు తీరుస్తానని, ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించి ఇస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ప్రధానిగా నరేంద్ర మోడీని 3వ సారి ఎన్నుకుందామని, తద్వారానే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.

కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాలా త్రిపుర సుందరి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహితి రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News