జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. వేడుకలలో భాగంగా ఆదివారం డప్పు, చప్పుల మధ్య శివసత్తుల నృత్యాలతో మహిళలు నెత్తిన బోనమెత్తి గ్రామంలోని పోచమ్మ దేవాలయం వరకు ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించుకున్నారు. రేణుక ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవ లో భాగంగా సోమవారం మాల ధారణ, అభిషేకాలు, జల బిందెల కార్యక్రమాలు, మంగళవారం జోగు కార్యక్రమం, బుధవారం శ్రీ కంఠమహేశ్వర సురమాంబ దేవి, మైసమ్మ తల్లి ప్రతిష్టల అనంతరం సాయంత్రం వేళ బోనాలు, రాత్రి వేళల్లో కళ్యాణం, గురువారం కల్పవృక్ష పూజ, బలిదానం, తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పైడిపల్లి ఆనందం గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బొంగోని వీరన్న గౌడ్, గౌడ సంఘం ఉపాధ్యక్షులు పైడిపెల్లి అయోధ్యగౌడ్, బొంగోని శ్రీనివాస్ గౌడ్, గుర్రపు తిరుపతిగౌడ్, పొన్నం వెంకటరమణ గౌడ్, పైడిపెల్లి పెద్ద భీమయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.