కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో దాన్యం కొనుగోలుపై అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా దాన్యం కొనుగోలు జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దాన్యం తేమ శాతం బట్టి కేంద్రాల నుండి మిల్లులకు ఏరోజుకారోజు తరలించాలని సూచించారు. ప్రారంబించిన అన్ని కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని, అవసరం మేర కేంద్రం వారిగా వాహనాలు, హమాలీలను ఎర్పాటు చేసుకోవాలని, ప్రతిరోజు దాన్యం కొనుగోలు వివరాలను రికార్డులలో నమోదు చేయాలని, ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా మండలం వారిగా ఇంచార్జీలు, తహసీల్దార్లు సమీక్షించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్, డిసిఓ శ్రీమాల, డిఆర్డిఒ శ్రీలలా, మార్కెటింగ్ అధికారి పద్మావతి, డియం సివిల్ సప్లై అధికారి శ్రీకాంత్, డిసిఎస్ఒ సురేష్, రైస్ మిల్లుల అసోసియోషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.