Monday, September 30, 2024
HomeతెలంగాణKisara: చెట్లను నరికినందుకు 1.80 లక్షల జరిమానా

Kisara: చెట్లను నరికినందుకు 1.80 లక్షల జరిమానా

క్రిమినల్ కేసులు కూడా పెడతామన అధికారుల హెచ్చరికలు

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం చేపడుతోంది. ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా పచ్చదనాన్ని పెంచేందుకు వందల కోట్లు ఖర్చుపెట్టి మొక్కలు నాటిస్తోంది. హరితహారం పేరుతో ఓ వైపు ప్రభుత్వం మొక్కలు నాటుతుంటే మరోవైపు కొంతమంది తమ స్వార్థం కోసం ఏపుగా పెరిగిన చెట్లను నరుకుతున్నారు. ఇప్పటికే వాతావరణం కాలుష్యంతో నిండిపోయింది. ఇప్పుడు ఉన్న చెట్లను కూడా నరికేస్తే మనిషి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. తాజాగా మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపల్ పరిధిలోని ఎస్ వి నగర్ రోడ్, విజయ హాస్పిటల్ ప్రక్కన నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ముందు ఉన్న చెట్లను యజమాని భగవాన్ దాస్ అనుమతులు లేకుండా చెట్లు తొలగించినందుకు ఒక లక్ష 80 వేల రూపాయలు(1,80,000) జరిమానా విధించి, వసూలు చేశారు నాగారం మున్సిపల్ అధికారులు. ఈ సందర్భంగా నాగారం మున్సిపల్ కమిషనర్ జి.రాజేందర్ కుమార్ మాట్లాడుతూ అనుమతి లేకుండా హరితహారం మొక్కలు తొలగించినచో పెనాల్టీ విధిస్తామని, అవసరమైతే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని స్థానికులందరూ ప్రశంసిస్తున్నారు. మరోసారి ఎవరూ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చేశారని అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News