Saturday, April 12, 2025
HomeతెలంగాణKorukanti Chander: కుల సంఘాలకు గౌరవం అందిస్తున్న కేసీఆర్

Korukanti Chander: కుల సంఘాలకు గౌరవం అందిస్తున్న కేసీఆర్

రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్

తెలంగాణ రాష్ట్రంలోని కులాలకు కుల సంఘాలకు తగిన గౌరవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అందిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. 38వ డివిజన్ లో ఆరె కటిక సంఘ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో సకల వర్గాలకు సంక్షేమం జరుగుతుందన్నారు. కులవృత్తులను నమ్మకుని జీవిస్తున్న వారికి సిఎం కెసిఆర్ ఆర్థిక భరోసా కల్పిస్తూ చేయూతను అందిస్తున్నారని చెప్పారు. ప్రతి కులాన్ని తగిన గౌరవం ప్రోత్సహం అందించి ఆత్మగౌరవ భవనాలు నిర్మాణానికి కృషి చేస్తున్నరన్నారు. సకల వర్గాల సంక్షేమం కోసం పని చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ను హ్యాట్రిక్ సీఎం చేయాలని రాబోయే ఎన్నికల్లో రామగుండంలో బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపి భారీ విజయాన్ని అందించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమాల్లో రామగుండం నగరపాలక డిప్యూటీ మేయర్ అభిషేక రావు, కార్పోరెటర్లు జంగపల్లి సరోజన, బాల రాజ్ కుమార్, నాయకులు జక్కుల తిరుపతి, దండు రవి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News